Power Ministry : కేంద్రం వద్ద ‘కేటాయించని’ విద్యుత్ వాడుకోండి..కోతలు వద్దు
ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ ను వాడుకోవాలని సూచించింది. వినియోగదారులకు కరెంటు సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదేనని స్పష్టం చేసింది.

Current
Unallocated Power : దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనలు నెలకొన్నాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో భాగంగా విద్యుత్ ను అవసరమైనంత వరకే వాడుకోవాలని సూచిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సర్దుబాటు చేసేందుకు కోతలు విధిస్తున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఈ దరిమిలా కేంద్రం అలర్ట్ అయ్యింది. 2021, అక్టోబర్ 12వ తేదీ మంగళవారం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
Read More : Power Crisis : తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు – జగదీశ్ రెడ్డి
ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ ను వాడుకోవాలని సూచించింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంటు సాయం చేయాలని సూచించింది. బొగ్గు కొరత వల్ల…కొన్ని రాష్ట్రాలు తమి వినియోగదారులకు కరెంటు సరఫరా చేయడం లేదని, కోతలు విధిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఈ సమయంలో వారు అధిక ధరలకు కరెంటును విక్రయిస్తున్నట్లు తెలుస్తోందని ప్రకటనలో వెల్లడించింది. సొంత వినియోగదారులకు కరెంటు సరఫరా చేయకుండా విద్యుత్ ను విక్రయించకూడదని, వినియోగదారులకు కరెంటు సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదేనని స్పష్టం చేసింది. 24×7 విద్యుత్ అందించాలని సూచించింది.
Read More : Power Crisis In India : పండగ పూట కరెంటు తిప్పలు…. తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం
సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల వద్ద 15 శాతం విద్యుత్ ను ఏ రాష్ట్రాలకు కేటాయించరని, అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం దీనిని కేటాయిస్తుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విద్యుత్ ను రాష్ట్రాలు ఉపయోగించుకుని..ప్రజలకు కరెంటు సరఫరా చేయాలని కోరుతున్నట్లు పేర్కొంది. మిగులు కరెంటు ఉంటే..ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని..ఈ విద్యుత్ ను కరెంటు అవసరం ఉన్న రాష్ట్రాలకు కేటాయించేందుకు వీలుంటుందని అభిప్రాయం వ్యక్త చేసింది. ఒకవేళ..కరెంటు అధిక ధరకు విక్రయించడం, వినియోగదారులకు సరఫరా చేయకుండా ఉంటే..కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.