Power Crisis : తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు – జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై వస్తున్న వార్థలు అర్ధరహితమని మంత్రి జగదీశ్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలో నిమిషం కూడా పవర్ కట్ కాదన్నారు.

Power Crisis : తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు – జగదీశ్ రెడ్డి

Telangana Current

Minister Jagadish Reddy Power Crisis : భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాలు విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో చీకట్లు అలుముకుంటాయనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడడంతో కోతలు విధించే పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో కరెంటు సరఫరా నిలిచివేయబడుతుందని వెల్లడించింది. మరి..తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటీ ? ఇక్కడ కూడా కరెంటు కోతలు, లేదా..విద్యుత్ సంక్షోభం పొంచి ఉందా ? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Read More : Power Crisis In India : పండగ పూట కరెంటు తిప్పలు…. తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై వస్తున్న వార్థలు అర్ధరహితమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో నిమిషం కూడా పవర్ కట్ కాదని, 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని స్పష్టం చేశారాయన. భారతదేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని, దేశాన్ని పాలిస్తున్న నేతలే దీనికి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుందన్నారు. శ్రీశైలం, సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు సరిపోతుందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.

Read More : Coal Crisis AP : ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే

మరోవైపు విద్యుత్ సంక్షోభంపై కేంద్రం అలర్ట్ అయ్యింద. సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. విద్యుత్ సంక్షోభం, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు. అదనపు విద్యుత్ కేటాయింపులకు కేంద్రం చర్యలు తీసుకొంటోందని తెలుస్తోంది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయనుంది. CGS లో కేటాయించని విద్యుత్ వాడుకోవాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో కేంద్ర విద్యుత్ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.