మాతో కలిసి మీరిద్దరు ఈ నిరసనలో పాల్గొనండి: ప్రశాంత్ కిశోర్
గత రాత్రి అభ్యర్థులు యువ సత్యాగ్రహ సమితి (వైఎస్‌ఎస్) పేరిట 51 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు

Prashant Kishor
బిహార్ సివిల్ సర్వీసెస్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పలువురు నేతలపై విమర్శలు గుప్పించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రశాంత్ కిశోర్ విద్యార్థులతో కలిసి ఈ నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. ఇవాళ ఆయన పాట్నాలోని గాంధీ మైదాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ నిరసనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ కూర్చోవాలని డిమాండ్ చేశారు.
గత రాత్రి అభ్యర్థులు యువ సత్యాగ్రహ సమితి (వైఎస్‌ఎస్) పేరిట 51 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఉద్యమంలో తాను ఓ భాగం మాత్రమేనని చెప్పారు. 100 మంది ఎంపీలు ఉన్న రాహుల్ గాంధీ, 70 మందికి పైగా ఎమ్మెల్యేలున్న తేజస్వి యాదవ్‌తో పాటు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడానికి వస్తే ఎవరినైనా సరే స్వాగతం పలుకుతామని తెలిపారు.
ఆ నేతలు తమ కంటే చాలా పెద్దవారని అన్నారు. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. బీజేపీ నాయకులు నిరసనలో పాల్గొంటారని తాము అనుకోవడం లేదని, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వారికి లేదని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
Telangana BJP New President : తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరు? రంగంలోకి సునీల్ బన్సల్..