ఏనుగుకే కాదు గర్భిణీ ఆవుకు కూడా బాంబు పెట్టారు.. ఎటు పోయిందో మానవత్వం

  • Published By: Subhan ,Published On : June 6, 2020 / 11:12 AM IST
ఏనుగుకే కాదు గర్భిణీ ఆవుకు కూడా బాంబు పెట్టారు.. ఎటు పోయిందో మానవత్వం

Updated On : June 6, 2020 / 11:12 AM IST

కేరళలో గర్భిణీ ఏనుగుకు పైనాపిల్ లో బాంబు పెట్టిన కొద్ది రోజులకే మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన వ్యక్తి గర్భిణీ ఆవుకు కూడా బాంబు పెట్టాడు. పంట పొలాలు నాశనం చేస్తుందని ఏనుగుకు బాంబు పెడితే.. ఏ పాపం చేయని ఆవుపై శాడిజంతో ఈ వికృత చర్యకు దిగబడ్డాడు. 

దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆవు యజమాని గుర్డియల్ సింగ్ దీనిపై అధికారులు తనకు సాయం చేయాలని కోరుతున్నాడు. తగిన న్యాయం చేయాలని దాడికి దిగబడ్డ వారిని శిక్షించాలని అడుగుతున్నాడు. పొరుగింట్లో ఉండే నందలాల్ అనే వ్యక్తి కావాలనే ఆవుపై దాడి చేశాడు. 

పేలుడు పదార్థాన్ని కావాలనే ఆవుకు తినిపించడంతో అది పేలి దవడకు గాయమైందని తెలిపాడు. ఘటన జరిగిన తర్వాత నందలాల్ పరారీలో ఉన్నాడు. ఆ గర్భిణీ ఆవు.. నోటి దవడ నుంచి రక్తం కూడా కారుతుంది. కొద్ది రోజులుగా అలా ఇబ్బంది పడుతూనే ఆహారం తింటుంది.

ఘటన జరిగిన పది రోజుల తర్వాత పోలీసులు Animal Cruelty Act and investigation కింద కేసు నమోదు చేశారు. 

Read: పైనాపిల్ కాదు, కేరళలో ఏనుగు మృతి కేసు విచారణలో కొత్త విషయం