గుడ్డ కావడిలో గర్భిణీ : 6 కిలోమీటర్లు కాలినడకనే 

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 10:57 AM IST
గుడ్డ కావడిలో గర్భిణీ : 6 కిలోమీటర్లు కాలినడకనే 

Updated On : December 4, 2019 / 10:57 AM IST

తమిళనాడు  ఈరోడ్ లోని బూర్గూర్‌లో ఓ గర్భిణిని 6 కిలో మీటర్ల దూరం గుడ్డతో చేసిన కావడిలో మోసుకెళ్లిన దుస్థితి నెలకొంది. అంబులెన్స్ సదుపాయాలు ఉన్నా  సరైన రోడ్లు లేకపోవడంతో గర్భిణీ ని 6 కిలోమీటర్ల దూరం గుడ్డతో చేసిన  ఊయలలో ఇద్దరు వ్యక్తులు మోసుకుంటూ తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. 

గర్భిణీ భర్త మరో వ్యక్తి సహాయంతో అంబులెన్స్ వరకూ ఆమెను మోసుకుని తీసుకువచ్చారు. కొండలు గుట్టలు ఎక్కుతూ దిగితూ ఎట్టలకే ఆమెను అంబులెన్స్ లో ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా..పండంటి మగపిల్లాడ్ని ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు.