రాష్ట్రపతికి అస్వస్థత..ఆర్మీ హాస్పిటల్ లో చేరిక

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో స్వల్ప నొప్పితో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ హాస్పిటల్ లో చేరారు కోవింద్​. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

రాష్ట్రపతికి అస్వస్థత..ఆర్మీ హాస్పిటల్ లో చేరిక

President Kovind Visits Army Hospital After Experiencing Chest Discomfort1

Updated On : March 26, 2021 / 3:35 PM IST

President Kovind భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో స్వల్ప నొప్పితో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ హాస్పిటల్ లో చేరారు కోవింద్​. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రాష్ట్రపతి ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కాగా,రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు. మార్చి 8న ఆయన సతీమణి, ప్రథమ మహిళ సవితా కోవింద్‌ కూడా టీకా తీసుకున్నారు.

ఇక,బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ..రాష్ట్రపతి కుమారుడికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.