Manipur violence @ 50 Days : 50 రోజులుగా మండుతున్న మణిపూర్ .. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం
మణిపూర్ లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రావటంలేదు. హింస పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన తప్పదా?ఇదే దీనికి పరిష్కారమా?

Manipur violence 50 days
Manipur violence : 50 రోజలుగా మణిపూర్ మండుతూనే ఉంది. ఇంకా.. అక్కడ దారుణమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామాలతో పాటు ప్రాణాలను రక్షించుకునేందుకు.. కుకీ, మైతీ తెగలకు చెందిన వారు ఆయుధాలు పట్టుకొని తిరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నుంచి మణిపూర్ ను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి. ఆఖరి అస్త్రంగా.. రాష్ట్రపతి పాలనను విధించే అవకాశం కూడా కనిపిస్తోంది.
హింసాత్మక ఘటనలతో మణిపూర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా.. కుకీ, మైతీ తెగలకు చెందిన వారు ఆయుధాలు చేతబట్టి.. బంకర్లలో తలదాచుకుంటున్నారు. పరస్పరం కాల్పులు కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది. జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకున్న మణిపూర్లో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కుటుంబాలను, ప్రాణాలను, ఊళ్లను కాపాడుకునేందుకు.. అన్నీ పక్కనపడేసి.. కుకీ, మైతీ తెగలకు చెందినవాళ్లు.. ఆయుధాలు చేతబట్టారు. దాంతో.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మణిపూర్ పోలీసులు.. ఇలా పెద్ద ఎత్తున బలగాలను మోహరించినా.. అక్కడ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. అల్లర్లు ఎందుకు ఆగడం లేదు?
దాదాపు 50 రోజులుగా మణిపూర్ మండుతూనే ఉంది. ఈ అల్లర్లలో 100 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా.. పర్వత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. వేలాది మంత్రి ప్రజలు శిబిరాల్లో ఉంటున్నారు. 60 వేల మంది తమ ఇళ్లను విడిచి పారిపోయారు. ఇప్పటివరకు 4300 విధ్వంస ఘటనలు సంభవించాయ్. వీటిలో భాగంగా.. 3500 ఇళ్లు, 275 గ్రామాలు ధ్వంసమయ్యాయి. మణిపూర్లో ఇప్పుడు పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా.. కుకీ, మైతీ వర్గాలే. ఈ రెండు వర్గాలు.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే పరిస్థితుల్లో ఉన్నాయి. మణిపూర్ మొత్తం సైన్యం విస్తరించినా.. అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలతో ఊచకోతకు పాల్పడుతున్నాయ్. ఇప్పుడు.. వారి చేతుల్లోకి ఆయుధాలు ఎలా వచ్చాయన్నదే.. ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. పైగా.. మణిపూర్ని అమిత్ షా సందర్శించిన తర్వాత కూడా హింసకాండ కంట్రోల్ కాలేదు.
Manipur Violence: మణిపూర్లో శాంతిభద్రతలు విఫలం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
అల్లర్లను ఆపేందుకు.. రెండు తెగల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా.. పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. రెండు తెగలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. హింసాకాండను ఆపేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. పరిస్థితుల్లో ఎంతకూ మార్పు రాకపోతే.. ఆఖరి అస్త్రంగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశముందని చెబుతున్నారు. అప్పుడు గానీ.. మణిపూర్ శాంతించదనే టాక్ వినిపిస్తోంది.