Priest Told to Kiss: పెళ్లి పీటలపైనే ముద్దు పెట్టుకోమని చెప్పిన పూజారి

స్వయంగా పూజారే వధూవరులను ముద్దుపెట్టుకోమని చెప్పడంతో బహిరంగంగానే చుంబించుకున్నారు కొత్త జంట. పెళ్లికొడుకు తండ్రి సంతోషంగా అలా చేయమంటూ పూజారికి చెప్పడంతో పూజారి కొత్త జంటకు....

Priest Told to Kiss: పెళ్లి పీటలపైనే ముద్దు పెట్టుకోమని చెప్పిన పూజారి

Priest Kissing

Updated On : November 25, 2021 / 1:42 PM IST

Priest Told to Kiss: సంప్రదాయ ప్రకారం.. జరిగిన పెళ్లిలో జీలకర్ర-బెల్లంతో మొదలై మూడు ముళ్లు వేసేటప్పుడు మెడపై స్పృశించడం, సప్తపది సమయంలో చిటికెన వేలు పట్టుకుని నడవడం మాత్రమే చూస్తాం. శతాబ్దాలుగా వస్తున్న ఆచారంలో ప్రతి ఘట్టం ప్రత్యేకతగా నిలిచిపోయింది. కానీ, ఇక్కడ విడ్డూరమైన వింత ఘటన చోటు చేసుకుంది.

స్వయంగా పూజారే వధూవరులను ముద్దుపెట్టుకోమని చెప్పడంతో బహిరంగంగానే చుంబించుకున్నారు కొత్త జంట. పెళ్లికొడుకు తండ్రి సంతోషంగా అలా చేయమంటూ పూజారికి చెప్పడంతో పూజారి కొత్త జంటకు సూచించాడు. అలా చెప్పేటప్పుడు కాస్త సిగ్గుపడుతూ.. తటపటాయిస్తూ ఎలా అయితే వారి చెవిన పడేశాడు.

వివాహానికి వచ్చిన బంధువుల సమక్షంలో భార్యను ముద్దు పెట్టుకున్నాడు పెళ్లికొడుకు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. కాకపోతే దీనికి మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం. హిందూ సంప్రదాయాలను అవమానిస్తున్నారని, వీడియో చాలా క్యూట్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు.

 

………………………………….. : జూ.ఎన్టీఆర్‌తో విడిపోయాం మంత్రి కొడాలి నాని క్లారిటీ!