గంగా ప్రాజెక్టు కోసం : మోడీ వస్తువుల వేలం

  • Published By: madhu ,Published On : September 12, 2019 / 02:01 AM IST
గంగా ప్రాజెక్టు కోసం : మోడీ వస్తువుల వేలం

Updated On : September 12, 2019 / 2:01 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చెందిన వస్తువులు మీరు సొంతం చేసుకోవచ్చు. వేలం పాటలో వీటిని దక్కించుకోవచ్చు. దాదాపు 2 వేల 722 వస్తువులను వేలం పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. వచ్చిన డబ్బును గంగా నదిని శుభ్రపరచడం కోసం వెచ్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నమామీ గంగే ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. 

మోడీ దేశ, విదేశాల్లో పర్యటిస్తుంటారు. ఈ సందర్భంగా ఆయననకు బహుమతులు వస్తుంటాయి. వీటిని పదర్శనకు ఉంచకుండా..వేలం వేస్తున్నారు. వచ్చిన డబ్బును వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వచ్చిన వస్తువులను నేషన్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచారు. కనీస ధరలు రూ. 200 నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉన్నట్లు తెలిపారు.

బహుమతుల్లో భారతీయులు ఇచ్చిన వస్తువులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మోడీకి వచ్చిన బహుమతులను వేలానికి ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు 2019 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా బహుమతులను వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. 
Read More : హై అలర్ట్ : చొరబడిన 40 మంది ఉగ్రవాదులు