PM Modi : కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ, పార్వతి కుండ్​లో శివుడికి హారతి ఇచ్చి ప్రత్యేకమైన పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు. పార్వతి కుండ్​లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు.

PM Modi : కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ, పార్వతి కుండ్​లో శివుడికి హారతి ఇచ్చి ప్రత్యేకమైన పూజలు

PM Modi Visit In Uttarakhand

Updated On : October 12, 2023 / 12:31 PM IST

PM Narendra Modi  In Uttarakhand  : ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్12,2023) ప్రధాని పిథోరాఘడ్ జిల్లాలోని ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులతో తలపాగా ధరించిన ప్రధాని మోదీ పార్వతి కుండ్​లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు.

ఈ పర్యటనలో భాగంగా మోదీ తనదైన శైలిలో స్థానికులను కలిశారు. జగేశ్వర్ ధామ్, సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించారు. స్థానికులతో ముచ్చటించారు. మహిళలతో ఆప్యాయంగా మాట్లాడారు. వారు నమస్కారం చేస్తుంటే మోదీ కూడా నవ్వుతు వారి చేతులు పట్టుకుని మాట్లాడారు. శిరస్సు వంచి నమస్కరించారు మోదీ. ఓ మహిళ మోదీ తలను ఆప్యాయంగా నిమిరారు. అక్కడే ఓ చిన్నారి మోదీ వద్దకు రాగా బాలుడికి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బాబు బుగ్గలు నిమిరి వాత్సల్యాన్ని చూపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పిథోరాగడ్ జిల్లాలోని రూ.4,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు. ఆది కైలాశ్​ను సందర్శించిన తరువాత ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 12 గంటలకు అల్మోరాలోని జగేశ్వర్ ధామ్‌కు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత పిథోరాగఢ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పిథోరాగఢ్‌లో సుమారు రూ. 4200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.