దోచుకున్న వారిని వదలా : మోడీ

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 09:49 AM IST
దోచుకున్న వారిని వదలా : మోడీ

Updated On : May 8, 2019 / 9:49 AM IST

ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల మీటింగ్‌లలో పాల్గొంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. మే 08వ తేదీ బుధవారం హరియాణాలోని ఫతేహాబాద్‌లో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మోడీ..హాట్ హాట్ కామెంట్స్ చేశారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేశారు. పరోక్షంగా ఆయనపై విమర్శలు చేశారు మోడీ. రైతులను దోచుకున్న వారిని కోర్టు వరకు తీసుకెళ్లినట్లు…ఈడీ ఆఫీసు కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 

మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే..వచ్చు ఐదేళ్లలో జైలుకు పంపడం ఖాయమన్నారు. రైతులను దోచుకున్న వారిని ఈ చౌకీదార్..న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తున్నాడని చెప్పారు. జవాన్లు..రైతులకు తగిన గౌరవం ఇవ్వడంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ఉగ్రవాదుల కుట్రలను తమ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతోందని..పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి వారిని హతమార్చారన్నారు.