ఇక కాస్కో : గంగలో మునకేసి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టనున్న ప్రియాంక

  • Published By: venkaiahnaidu ,Published On : January 27, 2019 / 06:20 AM IST
ఇక కాస్కో : గంగలో మునకేసి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టనున్న  ప్రియాంక

Updated On : January 27, 2019 / 6:20 AM IST

ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైన ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 4న పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాతో పాల్గొని పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. 

అన్న రాహుల్ గాంధీ తో కలిసి 4న ప్రయాగ్ రాజ్ లో పవిత్ర త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానం  ఆచరించి అక్కడి నుంచి రాజధాని లక్నో వచ్చి జాయింట్ ప్రెస్ ఏర్పాటు చేసి అదే రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రియాంక ఈ నెలాఖరుకు ఢిల్లీకి చేరుకోనునక్నారు. యూపీతో పాటు దేశవ్యాప్త ప్రచార బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రియాంక రాక కాంగ్రెస్ పార్టీలో కోత్త ఉత్తేజం తీసుకొస్తుందని పార్టీకి యూపీలో పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ప్రియాంక అచ్చం నాయినమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండటం కలిసొచ్చే అంశమని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను కాదని యూపీలో పొత్తు పెట్టుకున్న ఎస్పీ-బీఎస్పీ పార్టీలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రియాంకను డైరక్ట్ పాలిటిక్స్ లో తీసుకొచ్చి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రియాంక బాధ్యతలు చేపట్టనున్న తూర్పు ప్రాంతం చాలా కీలకమైంది.

ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు తూర్పు ప్రాంతంలో ఉండటం విశేషం. ప్రియాంక చాలా సమర్థురాలని, ఆమె రాకతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. యువ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని  రాహుల్ భావిస్తున్నారు.