Priyanka Gandhi : కాంగ్రెస్ అధిష్టానం బిగ్ డెసిషన్.. ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు

Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించింది.

Priyanka Gandhi : కాంగ్రెస్ అధిష్టానం బిగ్ డెసిషన్.. ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు

Priyanka Gandhi

Updated On : January 4, 2026 / 2:45 PM IST
  • ఏఐసీసీ కీలక నిర్ణయం
  • కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు
  • అస్సాం స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
  • పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకుకూడా ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు

Priyanka Gandhi : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో బాగంగా ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ఈ క్రమంలో అక్కడ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఆమెను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రియాంక గాంధీ కమిటీలో లోక్ సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్ ను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ అభ్యర్థుల ఎంపికలో కీలక భూమిక పోషించనుంది. ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులతోపాటు.. పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే అంశాలపై కమిటీ నిర్ణయించనుంది.

అస్సాంతో పాటు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లకు కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది.
కేరళ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షత వహిస్తారు.. సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ డాంగి, అభిషేక్ దత్ సభ్యులుగా ఉంటారు.
తమిళనాడు, పుదుచ్చేరి కమిటీకి టిఎస్ సింగ్ డియో నాయకత్వం వహిస్తారు.. యశోమతి ఠాకూర్, జిసి చంద్రశేఖర్, అనిల్ కుమార్ యాదవ్ సభ్యులుగా ఉంటారు.
పశ్చిమ బెంగాల్‌ కమిటీకి బీకే హరిప్రసాద్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. వీరితో పాటు మహ్మద్ జావేద్, మమతా దేవి, బిపి సింగ్ కూడా ఉన్నారు.
సంబంధిత ప్రధాన కార్యదర్శులు/ఇన్‌ఛార్జ్‌లకు అనుబంధంగా ఉన్న ప్రధాన కార్యదర్శులు/ఇన్‌చార్జ్‌లు, పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నాయకులు, ఏఐసీసీ కార్యదర్శులు ఆయా రాష్ట్రాల్లోని స్క్రీనింగ్ కమిటీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది.