Priyanka Gandhi: లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం.. పార్లమెంట్ వద్ద ఆసక్తికర దృశ్యం
ప్రియాంకా గాంధీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా పార్లమెంటు వద్ద ఆమె ఫొటోలను స్వయంగా తీశారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇవాళ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల కేరళలోని వయనాడ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేసిన గెలిచిన విషయం తెలిసిందే. ఆమె ఎంపీగా తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు.
పార్లమెంటుకు తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చారు ప్రియాంకా గాంధీ. పార్లమెంటు సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా పార్లమెంటు వద్ద ఆమె ఫొటోలను స్వయంగా తీశారు రాహుల్ గాంధీ.
ప్రియాంకా గాంధీ గెలిచిన సమయంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ప్రియాంక గాంధీ చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు క్షీరాభిషేకం చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రియాంకా గాంధీ వయానాడ్ లో అత్యధిక, రికార్డ్ స్థాయి మెజారిటీ తో విజయం సాధించి.. మొదటిసారి చట్ట సభలలో అడుగుపెడుతున్న ప్రియాంకా గాంధీకి వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంకా గాంధీ మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత అని, ఆమె మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వీహెచ్ అన్నారు.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi clicks a picture of his sister and party leader Priyanka Gandhi Vadra as she begins her journey as a Member of Parliament pic.twitter.com/KKFvkM1AUX
— ANI (@ANI) November 28, 2024