Priyanka Gandhi Vadra: పూల వర్షం .. ప్రియాంక వాద్రాకు కాంగ్రెస్ శ్రేణుల ఘనస్వాగతం.. వీడియో వైరల్

విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొడవునా పూలను పేర్చి ఆమెకు స్వాగతం పలికారు.

Priyanka Gandhi Vadra: పూల వర్షం .. ప్రియాంక వాద్రాకు కాంగ్రెస్ శ్రేణుల ఘనస్వాగతం.. వీడియో వైరల్

Priyanka Gandhi Vadra

Updated On : February 25, 2023 / 1:16 PM IST

Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. శనివారం రెండోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండోరోజు మహాసభల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. రాయ్ పూర్ చేరుకోగానే పూలవర్షం కురిపించారు. ఉదయం 8.30 గంటలకు ఆమె రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘెల్, పీసీఎస్ చీఫ్ మోహన్ మార్కం, ఇతర కాంగ్రెస్ నేతలు విమానాశ్రయంలో ప్రియాంకకు ఘన స్వాగతం పలికారు.

Congress Plenary: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం.. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక అంశాలపై తీర్మానాలు

విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొడవునా పూలను పేర్చి ఆమెకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతంతో ప్రియాంక వాద్రా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ మహాసభలు శనివారం రెండోరోజు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పాల్గొంది. అయితే రెండోరోజు మహాసభల్లో ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.