ED raids : సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రి ఇంట్లో ఈడీ దాడులు

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో మంత్రి ఇంటిపై గురువారం ఈడీ దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోదాలు చేసింది....

ED raids :  సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రి ఇంట్లో ఈడీ దాడులు

Rathin Ghosh

Updated On : October 5, 2023 / 9:49 AM IST

ED raids : పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో మంత్రి ఇంటిపై గురువారం ఈడీ దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోదాలు చేసింది. మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్‌కతాలోని మంత్రి ఇంటితోపాటు 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Also read : Kerala high court : నాకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య వినతి…కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

ఘోష్ మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులను రిక్రూట్ చేయడానికి స్కామ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఘోష్ ,అతని సహచరులు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు చెప్పారు.