Qutb Minar: కుతుబ్ మినార్‌ను విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ ఆందోళన

ల్లీలోని కుతుబ్ మినార్ పేరు మార్చాలంటూ ఆందోళనకు దిగాయి హిందూ గ్రూపులు. విష్ణు స్తంభ్ గా పేరును మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. మహాకాల్ మానవ్ సేవ, రైట్ వింగ్ కార్యకర్తలు..

Qutb Minar: కుతుబ్ మినార్‌ను విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ ఆందోళన

Qutb Minar

Updated On : May 12, 2022 / 10:13 AM IST

Qutb Minar: ఢిల్లీలోని కుతుబ్ మినార్ పేరు మార్చాలంటూ ఆందోళనకు దిగాయి హిందూ గ్రూపులు. విష్ణు స్తంభ్ గా పేరును మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. మహాకాల్ మానవ్ సేవ, రైట్ వింగ్ కార్యకర్తలు సంయుక్తంగా ప్లకార్డులు పట్టుకుని భారీగా మోహరించి ఉన్న పోలీసులు మధ్య నినాదాలు చేస్తూ కనిపించారు.వరల్డ్ హెరిటేజ్ గా యునెస్కో ద్వారా గుర్తింపు పొందిన కుతుబ్ మినార్ వద్ద హనుమాన్ చాలీసా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

also read :  Qutub Minar : కుతుబ్‌మినార్‌ ‘విష్ణు స్తంభం’అక్కడ హిందూ ఆచారాలు,పూజలు తిరిగి ప్రారంభించాలి : VHP నేత డిమాండ్

ఇదిలా ఉంటే, దేశరాజధాని ఢిల్లీలోని పలు ల్యాండ్ మార్క్ లైన అక్బర్ రోడ్, హుమాయున్ రోడ్, ఔరంగజేబ్ లానె, తుగ్లక్ లానెల పేర్లు మార్చాలని ఢిల్లీ బీజేపీ కోరుతుంది. ఈ మేరకు నార్త్ ఢిల్లీ మునిసిపల్ ఛైర్మన్ కు ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ ఆదేశ్ గుప్తా ఆ రోడ్లకు మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, మహర్షి వాల్మీకీ, జనరల్ విపిన్ రావత్ పేర్లు పెట్టాలని లెటర్ ద్వారా సూచిస్తున్నారు.

Read Also : రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు..కొత్త పేరు ఇదే