Qutub Minar : కుతుబ్‌మినార్‌ ‘విష్ణు స్తంభం’అక్కడ హిందూ ఆచారాలు,పూజలు తిరిగి ప్రారంభించాలి : VHP నేత డిమాండ్

కుతుబ్‌మినార్‌ ను ‘విష్ణు దేవాలయంపై నిర్మించారు. కాబట్టి అది ‘విష్ణు స్తంభం’అక్కడ హిందూ ఆచారాలు,పూజలు తిరిగి ప్రారంభించాలి అంటూ VHP నేత డిమాండ్ చేశారు.

Qutub Minar : కుతుబ్‌మినార్‌ ‘విష్ణు స్తంభం’అక్కడ హిందూ ఆచారాలు,పూజలు తిరిగి ప్రారంభించాలి : VHP నేత డిమాండ్

Qutub Minar Is A Pillar Of Lord Vishnu

qutub minar is a pillar of lord vishnu : కుతుబ్ మీనార్ ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్ గా పేరొందింది. ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణగా నిలిచింది. ఈ . ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్న ఈ కుతుబ్ మినార్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో నమోదు చేశారు. అటువంటి కుతుబ్ మినార్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. కుతుబ్‌మినార్‌ ను విష్ణు దేవాలయంపై నిర్మించారు అందుకే అది ‘విష్ణు స్తంభం అంటూ వీహెచ్ పీ నేత వినోద్‌ బన్సాల్‌ వ్యాఖ్యానించారు.

Also read : Delhi Police : నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో హైదరాబాద్‌లో ఢిల్లీ పోలీసుల దాడులు

కుతుబ్‌మినార్‌ ఒకప్పుడు విష్ణు స్తంభం అనీ..ఈ మినార్ ను హిందూ రాజు కాలంలో అంటే రాజా విక్రమాదిత్య కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్‌పీ నేత వినోద్‌ బన్సాల్‌ వ్యాఖ్యానించారు. ఈ స్తంభంలోని కొన్ని భాగాలను ఓ ముస్లిం పాలకుడు పునర్నిర్మించి కువ్వత్‌-ఉల్‌-ఇస్లాంగా పేరు మార్చారని అన్నారు. టవర్‌ కింది మూడు ఫ్లోర్లు, మిగతా ఫోర్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం చూడొచ్చని అన్నారు బన్సాల్. కుతుబ్‌మినార్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న పురాతన ఆలయాలను పునర్నిర్మించాలని, అక్కడ హిందూ ఆచారాలు, ప్రార్థనలు తిరిగి ప్రారంభించాలని వీహెచ్‌పీ శనివారం (ఏప్రిల్ 9,2022) డిమాండ్‌ చేసింది.

Also read : AP Cabinet 2.0 : ప్రమాణ స్వీకారానికి అసంతృప్తి నేతల డుమ్మా ?

కాగా ఈ కుతుబ్ మినార్ హైందవ నిర్మాణం అనే వాదన ఎప్పటినుంచో ఉంది. మిష్ణు స్తంభానికి మెరుగులు దిద్దితే కుతుబ్ మినార్ అయ్యిందని అంటుంటారు. కుతుబ్ అనగా ధృవం, మీనార్ అంటే స్తంభం, కుతుబ్ మీనార్ అనగా “ధృవపుస్తంభం”అని అర్థం. దానిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. ఈ మినార్ లో 399 మెట్లు పైవరకూ ఉన్నాయి. పునాది వద్ద 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణంగా ఉంది. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, ఇల్ టుట్ మిష్ పూర్తిచేశారు.