AP Cabinet 2.0 : ప్రమాణ స్వీకారానికి అసంతృప్తి నేతల డుమ్మా ?

మొదటి కేబినెట్ విస్తరణ జరిపిన సమయంలో ఎక్కడా కూడా అసంతృప్తి వెల్లడికాలేదు. కానీ.. మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో పెద్ద చిచ్చే పెట్టింది. ఓ వైపు ప్రమాణస్వీకారానికి...

AP Cabinet 2.0 : ప్రమాణ స్వీకారానికి అసంతృప్తి నేతల డుమ్మా ?

Jagan 2.0

AP Cabinet Reshuffle : ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సృష్టించిన అసమ్మతి జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. కాసేపట్లో ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి డుమ్మ కొట్టాలని అసంతృప్త నేతలు భావిస్తున్నట్లు సమాచారం. పదవులు దక్కకపోవడంతో సెక్రటేరియట్ దరిదాపులకు కూడా రావడం లేదు. పదవులు దక్కకపోవడంతో సుచరిత, పిన్నెల్లి, కరణం ధర్మశ్రీ, బాలినేనిలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయభానులు జిల్లాలకే పరిమితమయ్యారు. వీరిని బుజ్జగించేందుకు వైసీపీ నేతలు కీలక ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలితం కావడం లేదు. వైసీపీ నేతలు ఒక్కతాటిపై ఉంటుందని అధిష్టానం వ్యూహం ఇక్కడ ఫలించలేదు.

Read More : AP New Ministers Swearing – Live Updates: కాసేపట్లో.. ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్ డేట్స్

మంత్రివర్గ విస్తరణ అనంతరం వైసీపీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని.. అఖండ విజయంతో జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. సీఎం జగన్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం ఉండేది. మొదటి కేబినెట్ విస్తరణ జరిపిన సమయంలో ఎక్కడా కూడా అసంతృప్తి వెల్లడికాలేదు. కానీ.. మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో పెద్ద చిచ్చే పెట్టింది. ఓ వైపు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు పదవి ఆశించి దక్కించుకోని నేతలు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. మంత్రి పదవులు ఇవ్వకుండా తమను అవమానించారంటూ కొందరు అలక వహించారు… మరికొందరు కన్నీరు పెట్టుకున్నారు.. ఇంకొందరు పదవులకే రాజీనామాలు చేశారు. ఇక నేతల అనుచరులైతే రోడ్డెక్కి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాస్తారోకోలు, ఆందోళనలతో హోరెత్తించారు. కొందరు ఆత్మహత్యాయత్నాలు చేశారు. దీంతో సీనియర్లు రంగంలోకి దిగి అలకపాన్పు ఎక్కిన నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు.

Read More : Roja And Vidadala Rajini : ఏపీ హోం మంత్రి రోజా ? శాఖల కేటాయింపుపై ఉత్కంఠ!

మొన్నటి వరకు ఏపీకి హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత… రెండోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో ఏకంగా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసి… తన రాజీనామా లేటర్‌ను ఎంపీ మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు. అయితే మోపిదేవి ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీంతో రాజీనామా లేఖను తీసుకుని వచ్చారు మోపిదేవి. తనకు కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఆశించానన్నారు వైసీపీ సీనియర్‌ నేత పార్థసారథి. విజయవాడ బందరు రోడ్డులో ఆందోళన చేశారు. మంత్రిపదవి రాకపోవడంపై పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి కేబినెట్‌లోనే అన్యాయం జరిగిందంటే.. పునర్‌ వ్యవస్థీకరణలోనూ అన్యాయం జరిగిందని ఆవేదన వ్మయక్తం చేశారు.

Read More : Balineni : తగ్గేదేలే అంటున్న బాలినేని.. రాజీనామ దిశగా అన్నారాంబాబు ?

అయితే పార్టీని ఇబ్బంది పెట్టే ఏ పనీ తాను చేయబోన్నారు పార్థసారథి. అటు పార్థసారథిని బుజ్జగిస్తున్నారు వైసీపీ అగ్రనేతలు. అటు పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా రామకృష్ణారెడ్డి విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంపై మండిపడ్డారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం నిన్నంతా తన ఇంటికే పరిమితమయ్యారు. ఎవరినీ కలిసేందుకు ఇష్టపడలేదు. సీఎం కార్యాలయం నుంచి తనను సంప్రదించేందుకు జగన్‌ కార్యదర్శి ప్రయత్నించినా పిన్నెళ్లి అయిష్టంగా మాట్లాడి ఫోన్‌ స్విఛాఫ్‌ చేశారు.