Roja And Vidadala Rajini : ఏపీ హోం మంత్రి రోజా ? శాఖల కేటాయింపుపై ఉత్కంఠ!

ఎమ్మెల్యే రోజా మినిస్టర్ రోజా అయ్యారు. ఎట్టకేలకు రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గంలో అవకాశంపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించార

Roja And Vidadala Rajini : ఏపీ హోం మంత్రి రోజా ? శాఖల కేటాయింపుపై ఉత్కంఠ!

Roja Minister

Nagari MLA Roja ? : ఏపీలో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయకముందే ఏశాఖ ఎవరికొస్తుందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా హోం శాఖ ఎవరికిస్తారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హోంమంత్రి రేసులో కాబోయే మంత్రులు రోజా, విడదల రజనీ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి కేబినెట్‌లో సుచరితకు హోంశాఖ ఇవ్వడంతో సంప్రదాయన్ని కొనసాగిస్తూ మరోసారి మహిళకే ఆబాధ్యతలు అప్పగించే అవకాశముందని వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Read More : AP New Ministers Swearing – Live Updates: కాసేపట్లో.. ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్ డేట్స్

ఎమ్మెల్యే రోజా మినిస్టర్ రోజా అయ్యారు. ఎట్టకేలకు రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గంలో అవకాశంపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించారు. కానీ, రాలేదు. దీంతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఆశలు పెట్టుకున్నారు. ఆమె ఆశలను సీఎం జగన్ నెరవేర్చారు. రోజా ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఎట్టకేలకు ఆమె మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మొదటి విడతలోనే ఆమె మంత్రి పదవి ఆశించగా, చివరకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో దశలో కచ్చితంగా తనకు మినిస్టర్ పోస్ట్ వస్తుందని భావించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు రోజాకు మంత్రి పదవిపై ఉత్కంఠ నడిచింది. చివరకు తుది జాబితాలో ఆమె పేరు ఉంది. తన కల నెరవేరడంతో రోజా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజాకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోని రెండు మండలాలు పుత్తూరు, వడమాల పేట తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చాయి. మిగిలిన ఐదు జిల్లాలు చిత్తూరు జిల్లాలోకి వచ్చాయి. ఆ విధంగా రోజా రెండు జిల్లాల మంత్రిగా గుర్తింపు పొందారు.

Read More : Roja : మంత్రి పదవి రావడంతో రోజా కీలక నిర్ణయం.. సినిమాలకి, జబర్దస్త్‌కి రోజా గుడ్‌బై..

కొత్త మంత్రుల జాబితా 202గవర్నర్‌కు చేరింది. రాత్రి ఆయన కొత్త కేబినెట్‌కు ఆమోదం తెలిపారు. జాబితా చివరి నిమిషంలో ఆదిమూలపు సురేశ్‌ పేరు జాబితాలో చేర్చారు. సురేశ్‌కు బదులు తొలుత తిప్పేస్వామికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత తిప్పేస్వామి పేరును తొలగించి.. ఆదిమూలపు సురేశ్‌ పేరును చేర్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారానంతరం వారికి సీఎం జగన్‌ శాఖలను కేటాయించనున్నారు. ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం ఉదయం ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది.