హైకోర్టు జడ్జి కారుపై ఆయిల్ తో దాడి

kerala highcourt judge vehicle: కేరళ హైకోర్టు జడ్జి వీ.షిర్సే కారుపై బుధవారం ఉదయం ఓ వ్యక్తి నల్లటి ఇంజిన్ ఆయిల్ పోశాడు. 2018 మార్చిలో… పతనమిట్టకి చెందిన సెకండ్ ఇయర్ బీకాం చదువుతున్న జస్నా మరియా అనే విద్యార్థిని అదృశ్యం కేసు విచారణ సరైన రీతిలో సాగడం లేదని ఆరోపిస్తూ అతడు.. ఉదయం 9:45 గంటల సమయంలో జడ్జి కోర్టులోకి ప్రవేశించే టైంలో ఆయన అధికారిక వాహనం SUVపై మోటర్ ఆయిల్ ని చల్లాడు. జస్టిస్ట్ ఫర్ జాస్నా అనే ఫ్లకార్డు కూడా అతడి చేతిలో ఉంది.
ఆయిల్ తో దాడికి పాల్పడ్డ వ్యక్తిని..జడ్జి సెక్యూరిటీ ఆఫీసర్ పట్టుకొని సెంట్రల్ పోలీస్ కు అప్పగించాడు. హైకోర్టు రిజిస్టార్ మరియు సీనియర్ పోలీసు అధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. నిందితుడు కొట్టాయంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అయితే ఆయిల్ పోసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, జేమ్స్ కేసుతో అతడికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.