ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇదే : PubG గేమ్ బ్యాన్!

బాటిల్ రాయల్ వీడియో గేమ్ పబ్ జీ ఇండియాను పట్టిపీడుస్తోంది. ఆన్ లైన్ లో ఎన్నో వీడియో గేమ్ లు ఉన్నప్పటికీ... పబ్ జీ కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.. యూత్ ను కట్టిపడేసింది..

  • Published By: sreehari ,Published On : March 8, 2019 / 12:05 PM IST
ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇదే : PubG గేమ్ బ్యాన్!

బాటిల్ రాయల్ వీడియో గేమ్ పబ్ జీ ఇండియాను పట్టిపీడుస్తోంది. ఆన్ లైన్ లో ఎన్నో వీడియో గేమ్ లు ఉన్నప్పటికీ… పబ్ జీ కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.. యూత్ ను కట్టిపడేసింది..

బాటిల్ రాయల్ వీడియో గేమ్ పబ్ జీ ఇండియాను పట్టిపీడుస్తోంది. ఆన్ లైన్ లో ఎన్నో వీడియో గేమ్ లు ఉన్నప్పటికీ… పబ్ జీ కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.. యూత్ ను కట్టిపడేసింది.. పిల్లల నుంచి పెద్లల వరకు చాలా మంది ఈ పబ్ జీ మాయలో పడిపోయారు. యూత్ ఎక్కువగా ఈ పబ్ జీ గేమ్ కు బానిసలై పోయారు. క్షణం కూడా తీరక లేకుండా గంటల కొద్ది పబ్ జీ గేమ్ ఆడుతూ గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో పబ్ జీ సపోర్ట్ చేయడంతో ఇక పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. అదే పనిగా పబ్ జీ గేమ్ ఆడేస్తున్నారు. చదువు పాడైపోతుంది. చదువు మానేసి పబ్ జీ గేమ్ లో మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది. పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. 

ప‌బ్‌జీ భూతాన్ని తరిమికొట్టాల్సిందే..
దేశంలోని పలు రాష్ట్రాలను పబ్ జీ భూతం పీడిస్తోంది . పబ్ జీ గేమ్ బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. పబ్ జీ గేమ్ తక్షణమే బ్యాన్ చేయాలంటూ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా వాసులంతా డిమాండ్ చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో పిల్లలపై ఈ పబ్ జీ గేమ్ మానసికంగా, ఆరోగ్యపరంగా నెగిటీవ్ ఇంఫాక్ట్ క్రియేట్ అవుతుందని వాపోతున్నారు. ఈ పరిస్థితి మరింత దారుణ స్థితికి చేరుకోక ముందే పబ్ జీ గేమ్ నిషేధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సూరత్ జిల్లా పబ్ జీ గేమ్ ను నిషేధించింది. ఈ ఏడాదిలో గుజరాత్ ప్రభుత్వం కూడా స్కూళ్లలో పబ్ జీ గేమ్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
Also Read : ATMకు వెళ్తున్నారా? : కార్డు గికేటప్పుడు జాగ్రత్త!

ఇప్పుడు సూరత్ జిల్లా కూడా పబ్ జీ గేమ్ పై సమర శంఖం పూరించింది. పబ్ జీ బారిన పడి ఎంతోమంది చిన్నారులు తమ చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నారని, మానసికంగా కృంగిపోతున్నారని, పరీక్షల్లో కూడా మార్కులు సాధించలేని పరిస్థితి నెలకొందని, ఇందుకు పబ్ జీ నే ప్రధాన కారణంగా వెల్లడించింది. పబ్ జీ భూతాన్ని సూరత్ జిల్లా నుంచి తరిమికొట్టాలని ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. జిల్లా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు పబ్ జీ బ్యాన్ పై ఓ సర్యూలర్ జారీ అయింది. గుజరాత్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చైర్ పర్సన్ జాగృతి పాండ్యా ఈ సర్యులర్ ను జారీ చేసినట్టు స్థానిక మీడియా నివేదిక వెల్లడించింది. 

డ్రగ్స్ కంటే ప‌బ్‌జీనే డేంజర్..
పబ్ జీ గేమ్ పై నిషేధం విధించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలకు NCPCR లేఖ రాసినట్టు జాగృతి పాండ్య తెలిపారు. పబ్ జీ గేమ్ ను విజయవంతంగా బ్యాన్ చేస్తే.. పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా నిలువనుంది. ఇటీవల పబ్ జీ గేమ్ నిషేధంపై జమ్మూ కశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది. ఈ పబ్ జీ గేమ్ కారణంగా 10వ, ఇంటర్ విద్యార్థులకు పరీక్షల్లో మార్కుల శాతం భారీగా పడిపోయినట్టు తెలిపింది. డ్రగ్స్ కంటే పబ్ జీ గేమ్ ఎంతో డేంజర్ గా స్టూడెంట్స్ అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది. వెంటనే ఈ గేమ్ ను బ్యాన్ చేయాల్సిందిగా డిమాండ్ చేసింది.   
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు