పుల్వామా ఘటనపై రాహుల్ గాంధీకు 3 సందేహాలు

సరిగ్గా సంవత్సరం.. భారతదేశం ఉలిక్కిపడ్డ రోజు. దేశానికి రక్షణ కల్పించే సైనికులకే భద్రత కరువైన రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడి చేసినట్లుగా ప్రకటించింది.
ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు. ‘ఈ రోజు పుల్వామా ఘటనలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన రోజు. 1. ఈ దాడి వల్ల లాభపడిందెవరు? 2. దాడిపై జరిపిన విచారణలో బయటపడిందేంటి? 3. దాడి జరగడానికి కారణమైన భద్రతా లోపాలకు బీజేపీ ఏం సమాధానమివ్వగలదు? అనే ప్రశ్నలను సంధించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ.. ధైర్యవంతులైన సైనికుల ప్రాణత్యాగాలు మర్చిపోలేనివి. పుల్వామా దాడిలో గతేడాది ప్రాణాలు కోల్పోయారు. దేశాన్ని కాపాడటం కోసం వారి ప్రాణాలను అర్పించారు. భారత్ దీనిని ఎన్నటికీ మర్చిపోదు’ అని ట్వీట్ చేశారు. బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్