దేశాగ్రహం : 42మంది వీరుల మరణం

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 02:44 PM IST
దేశాగ్రహం : 42మంది వీరుల మరణం

Updated On : February 14, 2019 / 2:44 PM IST

జమ్మూ కశ్మీర్‌ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా  చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం తునాతునకలైంది. ఆ తర్వాత  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గురువారం సాయంత్రం (ఫిబ్రవరి 14వ తేదీ 2019) జరిగిన ఈ దాడిలో 42మంది జవాన్లు చనిపోయారు. 50మంది జవాన్లకు గాయాలయ్యాయి. భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ దాడి  తమపనేనని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడికి 100 కిలోల ఐఈడీని ఉపయోగించారు. 70 వాహనాల్లో 2వేల 500మంది జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్నారు.  అదను చూసి ఉగ్రవాదులు దెబ్బకొట్టారు. దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.

 

ఓ ఆత్మాహుతి ద‌ళ స‌భ్యుడు కాన్వాయ్‌లోకి కారును తీసుకెళ్లి త‌న‌ను తాను పేల్చేసుకున్నాడు. దాడి స‌మ‌యంలో కాన్వాయ్‌లో మొత్తం 70 వాహ‌నాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని  పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్‌ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి  కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్లపై ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యావత్ దేశం  షాక్‌‌కు గురి అయ్యింది. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా జిల్లాకు అదనపు బలగాలను తరలించారు.

 

టెర్రరిస్టుల దాడిలో కీలక పాత్ర పోషించిన అదిల్ అహ్మద్ దార్, దాడికి ముందు ఓ వీడియో సందేశం నెట్ ద్వారా పంపాడు. త్వరలోనే స్వేచ్చ లభిస్తుందంటూ ఆ వీడియోలో అదిల్ అహ్మద్ ప్రకటించాడు. మొత్తం 45 సెకన్ల వీడియోలో అదిల్ అహ్మద్ ప్రసంగం ఉంది. ఈ వీడియో ఎప్పటిది అనేది తెలీకపోయినా.. తాజా దాడికి సంబంధించినదే అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే: