FBI హెల్ప్ : వరవరరావు కేసులో పూణె పోలీసుల సంచలన నిర్ణయం

భీమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ కవి వరవరరావు కేసులో పూణె పోలీసుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న ఓ హార్డ్ డిస్క్‌లోని సమాచారాన్ని రిట్రీవ్ చేయడం కోసం అమెరికాకు చెందిన FBI సహకారం తీసుకోవాలనుకుంటున్నారు. వారి ద్వారా హార్డ్ డిస్క్‌లోని డాటాను వెలికి తీస్తే.. ఈ కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 17, 2018న వరవరరావును.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు ఆయనపై అభియోగాలు మోపారు. గత ఏడాది జనవరిలో భీమా కొరెగావ్‌లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో జూన్‌లో ఐదుగురిని అరెస్ట్ చేశారు పూణె పోలీసులు. వారిలో ఒకరి ఇంట్లో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
రాజీవ్‌గాంధీని హత్య చేసినట్లే.. ప్రధాని మోదీ ని కూడా హతమార్చాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలోనే వరవరరావు పేరు కూడా ఉండడంతో ఆయనపైనా కేసు నమోదయ్యింది. అయితే.. ఈ ఆరోపణలను వరవరరావు ఖండించారు. తాను ఎవరి హత్యకు కుట్ర పన్నలేదన్నారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది.
2018 జనవరి 01వ తేదీ మహారాష్ట్రలో పూణే సమీపంలో భీమా – కోరెగావ్ లో ఓ ఉత్సవాల్లో హింస చెలరేగింది.
* హింసను ప్రేరేపించారనే కారణంతో ఓ వర్గానికి చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* అరెస్టు అయిన వారు అగ్రస్థాయి మావోయిస్టులని పోలీసులు ఆరోపంచారు.
* తనిఖీలు చేయగా..రాజీవ్ గాంధీ హత్య తరహాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్య చేయడానికి నక్సలైట్లు కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు.
* 2018 నవంబర్ లో ప్రాథమిక ఛార్జీషీట్ సమర్పించారు.
* 2019 ఫిబ్రవరిలో అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేశారు.
* పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా..కోర్టులు నిరాకరించాయి.
* కొన్ని పిటిషన్లపై విచారణలు, తీర్పులు వాయిదా పడుతున్నాయి.
* కేసు విచారణ కూడా వాయిదాలతో సాగుతోంది.
Read More : CAA Protest : వీరి ఆచూకీ చెప్పండి..పోస్టర్ రిలీజ్