యాపిల్ పళ్ల వ్యాపారులపై ఉగ్ర దాడి

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 10:52 AM IST
యాపిల్ పళ్ల వ్యాపారులపై ఉగ్ర దాడి

Updated On : October 17, 2019 / 10:52 AM IST

కశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేస్తున్నారు. అక్కడి యాపిల్‌ పళ్ల వ్యాపారులపై దాడులకు దిగుతున్నారు. దీంతో వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షోపెయిన్‌ లో ఓ పళ్ల డీలర్‌ను ఉగ్రవాదులు చంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనివల్ల తాము వ్యాపారం చేయలేకపోతున్నామని, భయం..భయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చరణ్ జీత్ సింగ్ యాపిల్ వ్యాపారం చేస్తుంటాడు. కశ్మీర్ లోయ నుంచి ఫ్రూట్స్ తీసుకొస్తున్నారు. ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దీంతో సింగ్ అక్కడికక్కడనే చనిపోగా..సంజీవ్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జమ్ము, పంజాబ్ రక్షణశాఖ స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు తెగబడటం కలకలం రేపింది.

పొట్ట కూటికోసం పని చేసుకునే వారిని కూడా టెర్రరిస్టులు టార్గెట్ చేయడంతో డ్రైవర్లు, కూలీలు కశ్మీర్‌ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజస్థాన్ ట్రక్కు డ్రైవర్, ఓనర్‌ను కూడా ఉగ్రవాదులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఒక ఉగ్రవాది పాకిస్థాన్‌కు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కశ్మీర్ విభజన జరిగిన తర్వాత దాదాపు 72 రోజుల అనంతరం ఈ ఘటన జరిగింది. కమ్యునికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన తర్వాత ఉగ్రవాదులు తెగబడ్డారు. దీంతో పరిస్థితిని పర్యవేక్షించేందుకు డీజీపీ దిల్ బాగ్ సింగ్ బుధవారం అనంతనాగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.