అధికారంలోకి వస్తే రఫేల్ దోషులను శిక్షిస్తాం

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రఫేల్ దోషులపై చర్యలు తీసుకుంటాం: రాహుల్

  • Published By: chvmurthy ,Published On : January 4, 2019 / 03:05 PM IST
అధికారంలోకి వస్తే రఫేల్ దోషులను శిక్షిస్తాం

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రఫేల్ దోషులపై చర్యలు తీసుకుంటాం: రాహుల్

ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని కాంగ్రెస్‌ పార్టీఅధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. రఫేల్  వ్యవహారం అంటేనే మోడీ పారిపోతున్నారని రాహుల్ అన్నారు. కాగా  సభలో  రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రఫేల్ పై చర్చకు సమాధానం ఇస్తూ  రఫేల్ ఒప్పందంపై   రాహుల్ గాంధీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 
అనిల్‌ అంబానీ సంస్థకు రఫేల్‌ ఒప్పందంలో భాగస్వామ్యం కల్పించింది ఎవరని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీ కంపెనీని భాగస్వామిగా చేర్చాలని మోడీ కోరారని, ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ చెప్పారని రాహుల్ అన్నారు. రఫేల్ డీల్ అంతా మోడీ  ఆదేశాల మేరకు జరిగిందని రాహుల్ అన్నారు.