బీజేపీ మేనిఫెస్టో.. ఒంటరి వ్యక్తి స్వరంలా ఉంది : రాహుల్

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సోమవారం (ఏప్రిల్ 8,2019) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Published By: sreehari ,Published On : April 9, 2019 / 06:37 AM IST
బీజేపీ మేనిఫెస్టో.. ఒంటరి వ్యక్తి స్వరంలా ఉంది : రాహుల్

Updated On : April 9, 2019 / 6:37 AM IST

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సోమవారం (ఏప్రిల్ 8,2019) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సోమవారం (ఏప్రిల్ 8,2019) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘సంకల్ప్ పత్ర’ పేరిట రూపొందించిన ఈ హామీ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలను సంధించారు. బీజేపీ మేనిఫెస్టో ఒంటరి వ్యక్తి స్వరంలా ఉందంటూ రాహుల్ విమర్శించారు.

కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో కోట్లాది మంది దేశ ప్రజల గళంగా అభివర్ణించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను విస్తృతంగా చర్చించిన అనంతరం విడుదల చేశామన్నారు. తమ మేనిఫెస్టోలో మిలియన్ల మంది దేశ ప్రజల గళాన్ని వివేకంతో, శక్తివంతంగా ఉందని రాహుల్ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోను మాత్రం చీకటి గదిలో రూపొందించారన్నారు. అది.. ఒంటరి వ్యక్తి స్వరంలా ఉందని, అహంకరపూరితంగా ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. 

ఏప్రిల్ 11 నుంచి లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కానున్న తరుణంలో మూడు రోజులు ముందే బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో.. ఉగ్రవాదం నిర్మూలన, ఎన్ ఆర్ సీ అమలు, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి పలు అంశాలపై ప్రస్తావించారు. బీజేపీ మేనిఫెస్టోను జాన్సా పాత్ర అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు హెల్త్ కేర్, విద్య, జాతీయ భద్రతపై పలు హమీలను చేర్చాయి. బీజేపీ తమ మేనిఫెస్టోలో జాతీయ భద్రతకు తొలి ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటికే ప్రకటించిన పీఎం కిసాన్‌ పథకంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి అమలు, రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు లాంటి పలు కీలక అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.