నేను సారీ చెప్పా…మోడీ వీడియో క్లిప్ బయటపెడతా : రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2019 / 08:01 AM IST
నేను సారీ చెప్పా…మోడీ వీడియో క్లిప్ బయటపెడతా : రాహుల్

Updated On : December 13, 2019 / 8:01 AM IST

రేప్ ఇన్ ఇండియా అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదటిసారిగా ఓ నాయకుడు గట్టిగా పిలుపునిచ్చాడని,ఇదేనా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చే మెసేజ్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. రాహుల్ క్షమాపణలకు బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా కూడా పడింది. 

అయితే తాను మాత్రం క్షమాపణ చెప్పే సమస్యే లేదంటున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీని రేప్ ల రాజధానిగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన వీడియో క్లిప్ తన ఫోన్ లో ఉందని,అందరికీ కావాలంటే ట్విట్టర్ లో ఆ వీడియోను షేర్ చేస్తానని అన్నారు. కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల నుంచి అందరి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు తన వ్యాఖ్యలు బీజేపీ పెద్ద ఇష్యూగా మార్చిందని రాహుల్ అన్నారు. తాను మాత్రం క్షమాపణ చెప్పే ప్రశక్తే లేదన్నారు.

గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ…నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు.కానీ ఇప్పుడు మీరు ఎక్కడ చూసిన రేప్ ఇన్ ఇండియా కనిపిస్తోంది.ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళపై అత్యాచారం చేశాడు.ప్రధాని మోడీ దీనిపై మాట కూడా మాట్లాడలేదని రాహుల్ అన్న విషయం తెలిసిందే.