Karnataka Flag: కర్ణాటక జెండాపై రాహుల్ గాంధీ ఫొటో.. మండిపడుతున్న కన్నడ సంఘాలు

ఆదివారం మైసూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు రాహుల్ గాంధీ ఫొటోలు ముద్రించి ఉన్న అనేక జెండాలు చేతబూని యాత్రలో భాగస్వామ్యమయ్యారు. కాగా, కొన్ని జెండా మాత్రం కన్నడ జెండాను పోలి ఉన్నాయి. అందులో రాహుల్ అభివాదం చేస్తున్న చిత్రాన్ని ముద్రించారు

Karnataka Flag: కర్ణాటక జెండాపై రాహుల్ గాంధీ ఫొటో.. మండిపడుతున్న కన్నడ సంఘాలు

Rahul Gandhi image on Karnataka flag, Pro Kannada groups protests

Updated On : October 3, 2022 / 6:57 PM IST

Karnataka Flag: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా, ఈ యాత్రలో కర్ణాటక జెండాపై రాహుల్ గాంధీ చిత్రం కనిపించడం వివాదాస్పదంగా మారింది. దీనిని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. వాస్తవానికి ఆ జెండా కర్ణాటక అధికారిక జెండా కాకపోయినప్పటికీ.. అచ్చుగుద్దినట్టుగా కన్నడ జెండాను పోలి ఉంది. ఎరుపు, పసుపు రంగులు కన్నడ జెండాలో ప్రధానంగా ఉంటాయి. ఆ రెండు రంగులతోనే ఈ జెండా ఉంది.

ఆదివారం మైసూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు రాహుల్ గాంధీ ఫొటోలు ముద్రించి ఉన్న అనేక జెండాలు చేతబూని యాత్రలో భాగస్వామ్యమయ్యారు. కాగా, కొన్ని జెండా మాత్రం కన్నడ జెండాను పోలి ఉన్నాయి. అందులో రాహుల్ అభివాదం చేస్తున్న చిత్రాన్ని ముద్రించారు. దీంతో కన్నడను అవమానిస్తున్నారంటూ కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ సోమవారం బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్.. డీకే శివకుమార్ ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆమె 6వ తేదీన పాల్గొంటారు. దీనికి ముందు కర్ణాటక కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతారు.

Gujarat Poll: గుజరాత్‭ మళ్లీ బీజేపీదే.. ఈసారి భారీ మెజారిటీ.. తాజా సర్వే