Gujarat Poll: గుజరాత్‭ మళ్లీ బీజేపీదే.. ఈసారి భారీ మెజారిటీ.. తాజా సర్వే

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 45 శాతం ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్ బ్యాంక్ రానున్నట్లు సీ-ఓటర్ సర్వే పేర్కొంది.

Gujarat Poll: గుజరాత్‭ మళ్లీ బీజేపీదే.. ఈసారి భారీ మెజారిటీ.. తాజా సర్వే

BJP remain holds power in gujarat says survey

Gujarat Poll: తొందరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీనే గెలవనుందట. మరో విశేషం ఏంటంటే.. గత ఎన్నికల్లో 99 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ.. ఈసారి అఖండ మెజారిటీతో గెలవనుందట. ఇక విపక్ష కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నష్టపోనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఓట్ బ్యాంకు 9 శాతానికి పడిపోతుందట. పంజాబ్ అసెంబ్లీలో క్లీన్ స్వీప్ చేసి గుజరాత్‭లో జోరు మీద ప్రచారం చేస్తున్న ఆప్ అయితే ఏకంగా 19 శాతం ఓట్లు సాధించనుందట. అయితే సీట్లు మాత్రం ఒకటి లేదా రెండే వస్తాయట. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై సీ-ఓటర్ సర్వే చెబుతున్న లెక్కలివి.

తాజాగా విడుదల చేసిన సర్వే ప్రకారం.. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ఈసారి బీజేపీ 63 శాతం ఓట్ బ్యాంకుతో 135 నుంచి 143 సీట్లు గెలవనుందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 శాతం ఓట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే గత ఎన్నికల్లో 41 శాతం ఓట్లు సాధించగా.. ఈసారి ఏకంగా 9 శాతానికి పడిపోతుందని సర్వేలో పేర్కొనడం గమనార్హం. అయితే క్రితం ఒక్క శాతం కూడా ఓట్లు సాధించని ఆప్.. ఈసారి 19 శాతానికి ఎగబాకుతుందని చెప్పడం విశేషం.

దుర్గా మండపంలో మహిశాసురుడి తల స్థానంలో గాంధీ తల.. నయా కాంట్రవర్సీకి తెరలేపిన హిందూ మహాసభ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరు పట్ల గుజరాత్ ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే ప్రకారం.. 60 శాతం ఓటర్లు మోదీ పని విధానంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేవలం 22 శాతం మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఇక గుజరాత్ ప్రభుత్వ పనితీరుపై కూడా 36 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారట. వ్యతిరేకులు అటుఇటుగా 29 శాతం ఉండడం విశేషం. అయినప్పటికీ మోదీ ముఖంతోనే బీజేపీ ప్రచారం చేస్తుంది కాబట్టి.. ఈ ఎన్నికల్లో వచ్చే నష్టం ఏం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 45 శాతం ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్ బ్యాంక్ రానున్నట్లు సీ-ఓటర్ సర్వే పేర్కొంది.

Anti-Hijab Protest row: ఇరాన్‌లో ఆందోళనలపై మౌనం వీడిన సుప్రీం లీడర్ అయతుల్లా.. ‘అంతా అమెరికా వల్లే..’ అంటూ నిందలు