రాహుల్, ప్రియాంక గాంధీలు నిప్పు పెట్టి వస్తారు: మంత్రి

రాహుల్, ప్రియాంక గాంధీలు నిప్పు పెట్టి వస్తారు: మంత్రి

Updated On : December 25, 2019 / 1:25 AM IST

కాంగ్రెస్ లీడర్స్ ప్రియాంక, రాహుల్ గాంధీలు పెట్రోల్ బాంబుల లాంటోళ్లని హెచ్చరిస్తున్నారు బీజేపీ సీనియర్ లీడర్. మంగళవారం ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నాఆర్సీలపై రాహుల్, ప్రియాంకలు చూపిస్తున్న వైఖరిపై ట్వీట్ ద్వారా స్పందంచారు.

‘ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు పెట్రోల్ బాంబుల లాంటోళ్లు. వాళ్లు ఎక్కడకు వెళ్లినా నిప్పు పెట్టి వస్తారు. దాని కారణంగా పబ్లిక్ ప్రొపర్టీ నాశనమవుతోంది’ అంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ ట్విట్ చేశారు. 

పౌరసత్వ చట్టం గురించి జరిగిన ఆందోళనలో మరణించిన కుటుంబాలను కలుసుకునేందుకు రాహుల్, ప్రియాంకలు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై మంత్రి అలా స్పందించారు. మీరట్ లో తిరగొద్దని వారిపై నిబంధనలు ఉన్నప్పటకీ అన్నాచెల్లెళ్లు పట్టించుకోవడం లేదని ఉత్తరప్రదేశ్ పోలీస్ చెప్పారు. 

వారి పర్యటన తర్వాత ఎటువంటి ఆందోళన జరిగినా.. జిల్లాలో పరిస్థితి అదుపుతప్పినా వారే బాధ్యతే వహించాలనే స్టేట్‌మెంట్‌ను బయటపెట్టారు.