Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం.. : కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైనాకు సరైన గుణపాఠం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చైనాకు మోదీ భయపడుతున్నారు

Rahul Gandhi says China preparing for war but Centre is sleeping
Rahul Gandhi: పొరుగు దేశం చైనా యుద్ధానికి సిద్ధమైందని, అదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాజస్తాన్ రాష్ట్రంలో యాత్ర కొనసాగిస్తున్న రాహుల్.. శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైనాకు సరైన గుణపాఠం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చైనాకు మోదీ భయపడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. డిసెంబర్ 9న చైనా చొరబాటు చేస్తే నాలుగు రోజుల పాటు ప్రభుత్వం ఏం చేసిందని రాహుల్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని రాహుల్ డిమాండ్ చేశారు.
Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు
ఇక దేశంలో పెరిగిపోతున్న ధనిక, పేద అంతరాలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 100 మంది దగ్గర ఉన్న సంపద, దేశంలోని 55 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపదతో సమానమని ఆయన అన్నారు. దేశ సంపదను డబ్బులు ఉన్న కొద్ది మందికి మోదీ ప్రభుత్వం దోచి పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని పరోక్షంగా వారే నడిపిస్తున్నారని, దేశం వారి కోసమే నడుస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, మీడియా ప్రభుత్వానికి కీలు బొమ్మలుగా మారాయని రాహుల్ విమర్శించారు.