HALను చంపేస్తున్నారా : రాహుల్ డౌట్

  • Published By: venkaiahnaidu ,Published On : January 8, 2019 / 09:29 AM IST
HALను చంపేస్తున్నారా : రాహుల్ డౌట్

Updated On : January 8, 2019 / 9:29 AM IST

 అనీల్ అంబానీకి మేలు చేసేందుకే  హిందుస్థాన్  ఏరోనాటిక్స్  లిమిటెడ్(హెచ్ఏఎల్)   ను ప్రధాని నరేంద్రమోడీ మరింత బలహీనపరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హెచ్ఏఎల్ కు చెల్లించాల్సిన 15వేల 700కోట్ల బకాయిలు చెల్లించకుండా ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ కంపెనీకి ఒక్క రఫెల్ విమానం కూడా దేశానికి అందికముందే మోడీ 20వేల కోట్ల రూపాయలు కట్టబెట్టాడని రాహుల్ అన్నారు. హెచ్ఏఎల్ నష్టాల్లో ఉందని,  తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో  వెయ్యి కోట్లు సమకూర్చుకొనేందుకు హెచ్ఏల్  చూస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. 

అయితే రక్షణశాఖ మంత్రి నిర్మతా సీతారమన్ మాత్రం ఒకదాని తర్వాత మరొకటి అబద్దాలు చెబుతూనే ఉన్నారని, తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పడం లేదని  రాహుల్ తెలిపారు. హెచ్ఏల్ పై పార్లమెంట్ లో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగిన విషయమై  సోమవారం పార్లమెంట్ బయట తాను మాట్లాడిన వీడియోను రాహుల్ ట్వీట్ చేశారు.