రాహుల్, సోనియాకు వంద కోట్ల ట్యాక్స్ నోటీసులు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయపన్ను శాఖకు ట్యాక్స్ ఎగొట్టారనే కారణంగా ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయపన్ను శాఖకు ట్యాక్స్ ఎగొట్టారనే కారణంగా ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయపన్ను శాఖకు ట్యాక్స్ ఎగొట్టారనే కారణంగా ఐటీ అధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు. అసోసియేటడ్ జనరల్స్ లిమిటెడ్ కు సంబంధించి ఆదాయ పన్నుపై రాహుల్, సోనియాకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 ఏడాదిలో రూ. 100 కోట్ల ట్యాక్స్ ను చెల్లించకుండా తప్పించుకున్నారని నోటీసుల్లో పేర్కొంది. రాహుల్ గాంధీ రూ. 155.41 కోట్లు, సోనియా గాంధీ రూ. 154.96 కోట్ల రూపాయల పన్నును చెల్లించలేదని వెల్లడించింది.
దీనిపై సోనియా, రాహుల్ స్పందించలేదు. ఐటీ శాఖ సుప్రీంకోర్టుకు సోమవారం నివేదించింది. అసిస్ మెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు ఐటీ శాఖకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల సోనియా, రాహుల్ కు జస్టిస్ ఏకే సిక్రి, అబ్దుల్ నజీర్, ఎమ్ఆర్ షా తో కూడిన బెంచ్ అపడవిట్ ను దాఖలు చేయాలని, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్ 31న సోనియా, రాహుల్ తో పాటు ఆస్కార్ ఫెర్నాండస్ కు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది.