2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: కాంగ్రెస్ సీనియర్ నేత
దేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థి ఎంపీ రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (76) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కమల్ నాథ్ మాట్లాడుతూ... ‘‘2024 లోక్‌సభ ఎన్నికల గురించి ఆలోచిస్తే ఇప్పటివరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీల నాయకుడు మాత్రమే కాకుండా ప్రధాని అభ్యర్థి కూడా’’ అని చెప్పారు.

2024 Lok Sabha elections
2024 Lok Sabha elections: దేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థి ఎంపీ రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (76) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కమల్ నాథ్ మాట్లాడుతూ… ‘‘2024 లోక్‌సభ ఎన్నికల గురించి ఆలోచిస్తే ఇప్పటివరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీల నాయకుడు మాత్రమే కాకుండా ప్రధాని అభ్యర్థి కూడా’’ అని చెప్పారు.
రాహుల్ గాంధీ అధికారం కోసం కాకుండా దేశ ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరినైనా అధికారంలో కూర్చోబెట్టే అవకాశం ప్రజలకే ఉందని అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రను ఆయన కొనియాడారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పాదయాత్ర ఎవరూ చేయలేదని చెప్పారు. దేశం కోసం గాంధీ కుటుంబాన్ని మించిన త్యాగాలు ఏ కుటుంబమూ చేయలేదని అన్నారు.
కాగా, 2024లో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంపై ఇప్పటివరకు ఎవరూ ప్రకటన చేయలేదు. కమల్ నాథ్ మాత్రమే తొలిసారి ప్రధాని అభ్యర్థిపై ఇటువంటి వ్యాఖ్య చేశారు. జ్యోతిరాదిత్య సింధియా భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు కమల్ నాథ్ స్పందించారు. ‘‘వ్యక్తిగతంగా ఎవరిపైనా నేను కామెంట్ చేయను. అయితే, ద్రోహులు, పార్టీకి ద్రోహం చేసిన వారు, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీసిన వారికి మా పార్టీలో స్థానంలేదు’’ అని చెప్పుకొచ్చారు.
World Richest Person : 2022 ఏడాది చివరిలో ప్రపంచంలో టాప్ 10 సంపన్నులు వీరే.. ఇండియాలో..