Viral Video: మెరుపు వేగంతో స్పందించి.. అమ్మాయి ప్రాణాలు కాపాడి..
ఈ విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయిని లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

Railway Cop Saves Woman
Railway Cop: రైలు ఎక్కే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ఎంతగా ప్రచారం చేయిస్తున్నా ప్రయాణికులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు కదులుతోన్న సమయంలో దిగడం, ఎక్కడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
పశ్చిమ రైల్వే పరిధిలోని ఓ రైల్వే స్టేషన్‌లో తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగకముందే ఎక్కే ప్రయత్నం చేసింది ఓ అమ్మాయి. దీంతో ఒక్కసారిగా జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఉండే ఖాళీలో పడబోయింది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయిని లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. సమయానికి ఆ ప్రయాణికురాలిని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది చూశారు కాబట్టి ఆమె గాయాలు కాకుండా బయటపడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన మహిళ ఆర్పీఎఫ్ ఉద్యోగిని అధికారులు అభినందించారు.
Fearless Female RPF Officer Springs into Action???
Her timely rescue not only saved a life but also carries a vital message:
‘Do not board or alight from a moving train’?️#WednesdayWarriors pic.twitter.com/rLHQiz0Kxn
— Western Railway (@WesternRly) December 20, 2023
Year End Roundup 2023 : 2023 లో వార్తల్లో నిలిచిన అంటువ్యాధులు ఇవే