Year End Roundup 2023 : 2023 లో వార్తల్లో నిలిచిన అంటువ్యాధులు ఇవే
2023 కి బైబై చెప్పేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. గడిచిన సంవత్సరంలో జనం అనేక ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల బారిన పడ్డారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇబ్బంది పెట్టిన అంటువ్యాధులపై వచ్చే ఏడాదికి మరింత అప్రమత్తత అవసరం.

Year End Roundup 2023
Year End Roundup 2023 : 2024 కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 2023 ముగుస్తున్న తరుణంలో అనేక అంశాలను రివైండ్ చేసుకుంటూ ఉంటాం. కొత్త తీర్మానాలను చేసుకుంటాం. వాటిలో ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయి. గడిచిన సంవత్సరంలో కొన్ని అంటువ్యాధులు జనంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దాంతో కొందరు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు.
Covid-19 Update : భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు
MERS ఇన్ఫెక్షన్.. ఇది కూడా ఒక రకమైన కరోనా వైరస్. దీనికి ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. కోవిడ్-19 కి సంబంధించిన ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్.. 2023 లో అనేకమంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కావడంతో దీని వ్యాప్తిని నిరోధించాలంటే 2024 లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కోవిడ్-19 కేసులు 2023 లో కూడా గణనీయంగా గుర్తించారు. 2023 ప్రారంభంలో ఇండియా, యునైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరిగాయి. ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకలేదు. 2024 లో సైతం ప్రజలు దీనిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Telangana Corona : తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన
టొమాటో ఫీవర్.. 2023 లో పిల్లల్లో ఇది గుర్తించబడింది. ఇది ఒకరి నుండి మరొకరికి ఈజీగా సోకుతుంది. ఈ అంటు వ్యాధిపై 2024 లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నివారణ కోసం నిర్దిష్టమైన జాగ్రత్తలు కూడా అవసరం. కొన్ని నెలల క్రితం కండ్ల కలక కేసులు కూడా గణనీయంగా కనిపించాయి. పింక్ ఐగా పిలవబడే ఇది ఇతరులకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. కనురెప్పల లోపల, బయట కంటి లోపలి భాగాలను ఇది ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్. దీని వ్యాప్తిని నిరోధించడానికి కూడా తగిన జాగ్రత్తలు అవసరం. కొత్త సంవత్సరం తీసుకునే తీర్మానాల్లో ఆరోగ్యపరమైన అంశాలపై కూడా దృష్టి పెట్టడం ఎంతో అవసరం. మంచి ఆహారపు అలవాట్లు.. తగిన వ్యాయామం.. ఇన్ఫెక్షన్స్ ప్రబలుతున్న సమయంలో అప్రమత్తత, తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం.