Covid-19 Update : భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు

కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారకముందే చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్‌ను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

Covid-19 Update : భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు

Covid-19 Update

Covid-19 Update : దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 358 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆరుగురు మరణించారు.

Covid-19 : దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను కొత్త కేసులు నమోదు

దేశం వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో 2,669 కేసులు ఉన్నాయి. JN.1 కోవిడ్ వేరియంట్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి మరింత ప్రమాదకరంగా మారింది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ లక్షణాలను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది తేలికపాటిదే అయినప్పటికీ రూపం మార్చుకున్నప్పుడు కొత్త లక్షణాలను పొందుతుందని అంటున్నారు. సాధారణ జలుబుతో ప్రారంభమైనప్పటికీ ఇది గుండెపోటు, స్ట్రోక్, డయాబెటీస్, డిప్రెషన్ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నవారిలో దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది.

కొత్త వేరియంట్‌ను తేలికగా తీసుకోవద్దని, దాని బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కోవిడ్ అరికట్టడానికి వ్యాక్సిన్‌ సహాయపడినా.. కొత్త వేరియంట్ భిన్నంగా ఉండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ JN.1 ను జన్యుశాస్త్రం ప్రకారం సాల్టేషన్ ఈవెంట్ అంటారు. జ్వరం, దగ్గు, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, తినలేకపోవడం, వాంతులు ఇలాంటి లక్షణాలు కనపడతాయి.

Corona Virus : మూడు రాష్ట్రాల్లో కొత్త జేఎన్.1 వేరియంట్ కేసులు.. గోవాలో అత్యధికం, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎన్నంటే?

భారత్‌లో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తగిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని సూచించింది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. మందులు, ఆక్సిజన్ సిలెండర్లు స్టాక్ ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చండీగఢ్‌లో ఇప్పటికే మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారుల సూచనలు చేస్తున్నారు.