Covid-19 : దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను కొత్త కేసులు నమోదు

దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.

Covid-19 : దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను కొత్త కేసులు నమోదు

covid-19 In India : దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పలు వేరియంట్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ మరోసారి భారత్ లో విస్తరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసుల పెరుగుదల కనిపిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 2669 యాక్టివ్ కేసులు ఉండగా వాటిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి,మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో 5 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక కోవిడ్ కేసు తమిళనాడు 12,కర్ణాటక లో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 14 యక్టీవ్ కేసులుండగా..ఏపీలో ఒక యక్టివ్ కేసు ఉంది. జెఎన్.1 కొత్త వేరియంట్ నేపధ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేసులు నమోదు అవతున్న రాష్ట్రాలతో పాటు కేసులు లేని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక కేరళ విషయానికొస్తే దేశంలో కేరళ రాష్ట్రంలోనే మహమ్మారి ప్రతాపం కనిపిస్తోంది.కోవిడ్ తో కేరళలో ముగ్గురు చనిపోయారు.

కొవిడ్ -19 కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జేఎన్.1 వేరియంట్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే, ఈ కొవిడ్-19 కొత్త వేరియంట్ కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో 21 కేసులు గుర్తించినట్లు బుధవారం కేంద్రం తెలిపింది. అత్యధికంగా గోవాలో 19 కేసులు నమోదు కాగా.. కేరళ, మహారాష్ట్రాలలో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ కేసులు పెరగకుండా పరీక్ష కేంద్రానలు పెంచాలని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది.