Corona Virus : మూడు రాష్ట్రాల్లో కొత్త జేఎన్.1 వేరియంట్ కేసులు.. గోవాలో అత్యధికం, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎన్నంటే?

జేఎన్.1 వేరియంట్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 614 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Corona Virus : మూడు రాష్ట్రాల్లో కొత్త జేఎన్.1 వేరియంట్ కేసులు.. గోవాలో అత్యధికం, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎన్నంటే?

JN1 variant cases

Covid-19 updates: కొవిడ్ -19 కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జేఎన్.1 వేరియంట్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే, ఈ కొవిడ్-19 కొత్త వేరియంట్ కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో 21 కేసులు గుర్తించినట్లు బుధవారం కేంద్రం తెలిపింది. అత్యధికంగా గోవాలో 19 కేసులు నమోదు కాగా.. కేరళ, మహారాష్ట్రాలలో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ కేసులు పెరగకుండా పరీక్ష కేంద్రానలు పెంచాలని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది.

Also Read : Coronavirus : కరోనా కొత్త వేరియంట్‌తో జాగ్రత్త.. అలాంటి వాళ్ళు ఇంటికే పరిమితం కావాలి- బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

మరోవైపు జేఎన్.1 వేరియంట్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 614 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మే 21 తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గోవా, కేరళ, మహారాష్ట్రాల్లో మాత్రం జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అయితే, తాజాగా కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, కానీ, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కర్ణాటకలో కరోనాతో ఓ వృద్ధుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. గుండె, క్షయ, ఆస్తమా ఇతర ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆ వృద్ధుడు బాధపడుతున్నాడు. అతని మరణానికి ప్రత్యేకించి కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కారణమా అన్నవిషయం ఇంకా తేలాల్సి ఉంది. అయితే, కర్ణాటక రాష్ట్రంలో రెండేళ్ల తరువాత కరోనా మరణం చోటు చేసుకోవటం జరిగింది.

Also Read : Corona New Variant : దేశంలో మళ్లీ కంగారు పెడుతున్న కరోనా

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ వెల్లడించింది. కొవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14 ఉన్నట్లు, నమోదైన కొత్త కేసులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జేఎన్ .1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు రాష్ట్రంలో నమోదుకాకుండా.. కరోనా వ్యాప్తి విస్తరించకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసుల సంఖ్య నమోదవుతుంది. బుధవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు రికార్డైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ బులిటెన్ ద్వారా వెల్లడించింది.