Railway Minister Ashwini Vaishnaw : చీపురు పట్టి రైల్వే స్టేషన్ ను ఊడ్చిన రైల్వే మంత్రి

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ చీపురు పట్టుకున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా పఖ్వాడాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఢిల్లీలోని హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్‌లో చీపురు ప‌ట్టి ఊడ్చారు.

Railway Minister Ashwini Vaishnaw : చీపురు పట్టి రైల్వే స్టేషన్ ను ఊడ్చిన రైల్వే మంత్రి

Updated On : September 17, 2022 / 2:06 PM IST

Railway Minister Ashwini Vaishnaw : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ చీపురు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్ ను నీట్ గా ఊడ్చారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా పఖ్వాడాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఢిల్లీలోని హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్‌లో చీపురు ప‌ట్టి ఊడ్చారు.

ఈ సందర్భంగా మం త్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..భార‌తీయ రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, ఐటీతో పాటు ఇత‌ర శాఖ‌ల్లో స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మం మొద‌లైంది అని తెలిపారు. రాజ‌కీయాల్లో సేవ‌భావం ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. అలాగే స్వ‌చ్ఛ‌త కూడా ఓ స‌ర్వీస్ అని మంత్రి ..పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తాను చీపురుతో రైల్వే స్టేషన్ ను ఊడ్చిన వీడియోను మంత్రి ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

Also read : PM Modi’s birthday : ప్రధాని మోడీ పుట్టిన రోజున జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు బహుమతి

కాగా సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో విమోచన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్‌లో చీపురు ప‌ట్టి ఊడ్చారు. అలాగే పలు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు మోడీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతలు ప్రధాని మోడీ పుట్టినరోజు నాడు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు బహూకరించారు.

కాగా..ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ 21 రోజులు ‘సేవ, సమర్పణ్’(గిఫ్ట్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ‘సేవా పఖ్వాడా’ పేరుతో పేదల సంక్షేమానికి ప్రధాని మోడీ జన్మదినాన్ని అంకితం చేయనున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ అరుణ్ సింగ్ తెలిపారు. ఈ వేడుక మూడు కేటగిరిగా ఉంటుందని మొదట సేవ. దీంట్లో ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, టీకాలు వేయటం వంటి ఉంటాయి. రెండోది శుభ్రత. శుభ్రత చాలా ముఖ్యం అని మోడీ చెబుతుంటారు. శుభ్రతపై దృషి పెడతాను. అందువల్ల క్లీనెస్ డ్రైవ్ లు చేపట్టామని..అలాగే పీపాల్ చెట్టు ఆక్సిజన్ ఇచ్చే చెట్టు. కాబట్టి 10 లక్షల పీపాల్ చెట్లు నాటాలని నిర్ణయించామని తెలిపారు.