రాజ్‌థాక్రే వంతు: ఈడీ ముందుకు మహా నేత.. ముంబైలో 144 సెక్షన్

  • Published By: vamsi ,Published On : August 22, 2019 / 11:32 AM IST
రాజ్‌థాక్రే వంతు: ఈడీ ముందుకు మహా నేత..  ముంబైలో 144 సెక్షన్

Updated On : August 22, 2019 / 11:32 AM IST

వివిధ కేసులకు సంబంధించి ఈడీ ముందుకు రాజకీయనాయకులు హాజరు అవుతున్న క్రమంలోనే ఇప్పుడు మహా రాష్ట్ర రాజ్ థాక్రే వంతు వచ్చింది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవా చీఫ్ రాజ్ థాక్రేను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎంఎన్ఎస్  కార్యకర్తలు ఆందోళనకు దిగే అవకాశం ఉండడంతో ముంబైలోనీ ఈడీ కార్యాలయం ముంబై పోలీసులు పరిసరప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు.

ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కేసుకి సంబంధించి విచారణకోసం ఈడీ సమన్లు జారీచేయగా ఈడీ ఆఫీసుకి వచ్చిన ఆయన అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.

కోహినూర్ లోని సీటీఎన్ఎల్ లో రాజ్ థాక్రే పెట్టుబడులకు సంబంధిచిన వివరాల గురించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.  రాజ్ థాక్రే నివాసం వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ఉమేష్ జోషీ, రాజేంద్ర శిరోడ్కర్ లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే సంయమనం పాటించాలని రాజ్‌థాక్రే పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు.