CM Ashok Gehlot : మరో సీఎంకి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ పౌరులతోపాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.

CM Ashok Gehlot : మరో సీఎంకి కరోనా పాజిటివ్

Cm Ashok Gehlot

Updated On : January 6, 2022 / 7:13 PM IST

CM Ashok Gehlot : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ పౌరులతోపాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారిన పాడగా.. గురువారం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్నీ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం సాయంత్రం కరోనా పరీక్షా చేయించుకుగా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆయన తెలిపారు.

చదవండి : Ashok Gehlot : లంచాల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించిన సీఎంకి షాకింగ్ రిప్లై

తేలికపాటి లక్షణాలు ఉన్నాయని.. కంగారు పడాల్సిన పనిలేదని వివరించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇక ఒమిక్రాన్ నిర్దారణ కోసం అధికారులు శాంపిల్స్ తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గురువారం కేంద్రమంత్రి నిత్యానందరాయ్, భారతీ ప్రవీణ్ పవార్, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్నీ వారు తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

చదవండి : Ashok Gehlot : హాస్పిటల్ లో రాజస్తాన్ సీఎం..త్వరగా కోలుకోవాలని మోడీ ట్వీట్