Rajasthan CM : రాజస్థాన్ అధికార పీఠాన్ని అధిష్టించేది ఎవరు? యూపీలాగా మరో ‘యోగి’ సీఎం కానున్నారా..?!

ఈయన్ని చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన కూడా ‘యోగి’యే. ఈయన్ని రాజస్థాన్ ‘యోగి’అంటారు. ఈ యోగి రాజస్థాన్ అధికార పీఠాన్ని దక్కించుకుంటారా..? లేదా రాజకుటుంబానికి చెందినవారికి దక్కుతుందా.. ఇంతకీ ఎవరీ రాజస్థాన్ యోగీ..?

Rajasthan CM : రాజస్థాన్ అధికార పీఠాన్ని అధిష్టించేది ఎవరు? యూపీలాగా మరో ‘యోగి’ సీఎం కానున్నారా..?!

Rajasthan Yogi mahant balak nath

Rajasthan BJP Won : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్ గఢ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు 115 స్థానాల్ని బీజేపీ దక్కించుకుని అత్యంత ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రాజస్థాన్ సీఎం పీఠాన్ని అధిష్టించేది ఎవరు..? అనే ఆసక్తి మొదలైంది.

ఇప్పటికే రెండుసార్లు సీఎంగా పనిచేసిన వసుంధరా రాజే మరోసారి సీఎం అవుతారనే అభిప్రాయాలు వస్తున్న క్రమంలో కొత్తగా ఓ పేరు వినిపిస్తోంది. ఈయన్ని చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన కూడా ‘యోగి’యే. ఈయన్ని రాజస్థాన్ ‘యోగి’అంటారు. ఈయన కూడా అచ్చంగా యూపీ సీఎం యోగిలాగానే కాషాయబట్టలు ధరించి ఉంటారు. యోగి కంటే ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తారు నెత్తిమీద కాషాయరంగు తలపాగా,కాషాయరంగు దుస్తులు ధరించి.

ఆయనే మహంత్ బాబా బాలక్ నాథ్. రాజస్థాన్ సీఎం రేసులో బాబా బాలక్ నాథ్ పేరు వినిపిపిస్తోంది. రాష్ట్రంలో ఈయన అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తి. రాజస్థాన్ యోగి అని పిలుస్తారు. బీజేపీ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ మస్త్ నాథ్ మఠంలో ఎనిమిదో మహంత్. ఈయన ఓబీసీ కేటగిరి నుంచి వచ్చారు, యూపీలో వలెనే బాబా బాలక్ నాథ్ కు బీజేపీ సీఎం పదవి అప్పగించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈయన తిజారా అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 6173 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 11,0209 ఓట్లు గెలుచుకున్నారు.

Also Read : వారికి గుణపాఠం- ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన బీజేపీ తాజాగా ఈ యోగిని సీఎం పీఠంపై కూర్చోపెడుతుందా..? అనే వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ లో బీజేపీ గెలుపు ఘనంగానే ఉన్నా ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో బాలక్ నాథ్ పేరు తెరమీదకు రావటం ఆసక్తికరంగా మారింది.

బాలక్ నాథ్ పేరుతో పాటు మాజీ సీఎం వసుంధరా రాజే, అలాగే జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్ లో వసుంధర రాజే కూడా రాజ కుటుంబానికి చెందినవారే. దియా కూడా రాజకుటుంబానికి చెందినవారే . దీంతో దియాను వసుంధరా రాజేకు ప్రత్యామ్నాంగా చెబుతుంటారు. ఈ క్రమంలో బాబా బాలక్ నాథ్ పేరు సీఎం రేసులో వినిపిస్తుండటంతో యూపీలా రాజస్థాన్ లో కూడా ‘యోగి’ ప్రభుత్వం ఏర్పడుతుందా..? అనే చర్చ నడుస్తోంది.

Also Read :  మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే హవా.. ఘోర పరాభవం పాలైన కాంగ్రెస్

అంతేకాదు సీఎం రేసులో వసుంధరా రాజే, దియా కుమారి, బాబా బాలక్ నాథ్ పేర్లతో పాటు జోథ్ పూర్ లోక్ సభ నుంచి ఎంపీగా ఉన్న కేంద్రంలో జలశక్తి మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, సతీష్ పూనియా. రాజేంద్ర రాథోడ్, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా,ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్ వంటి పేర్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. దీంతో రాజస్థాన్ సీఎం పీఠం ఎవరికి దక్కుతుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.