PM Modi : వారికి గుణపాఠం- ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో యువతను ఉద్యోగాల కుంభకోణం ద్వారా అక్కడి ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ విధానాల వల్ల గిరిజన సమాజం వెనుకబడిపోయింది.

PM Modi : వారికి గుణపాఠం- ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్ కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ కూటమికి వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని విభజించే రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు ప్రధాని మోదీ.

”నేడు అణగారిన వారి ప్రాధాన్యత అనే ఆలోచన గెలిచింది. పారదర్శకత, సుపరిపాలన నేడు గెలిచాయి. ఓటర్లందరికీ గౌరవపూర్వకంగా అభివాదం చేస్తున్నాను. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ లో ప్రజలు బీజేపీపై విశ్వాసం వ్యక్తపరిచారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. నా తల్లులు, సోదరీమణులు, యువ రైతులు, పేద సోదరులు తీసుకున్న నిర్ణయానికి, హృదయపూర్వకంగా ఆదరించినందుకు వారికి నమస్కరిస్తున్నాను. ఈ ఎన్నికల్లో దేశాన్ని కులాల వారిగా విభజించే ప్రయత్నం చేశారు.

Also Read : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

నా దృష్టిలో స్త్రీ శక్తి, యువ శక్తి, రైతులు, పేదలు అనేవే నాలుగు కులాలు. నేడు పెద్ద సంఖ్యలో OBC, గిరిజన కులాలు బీజేపీ వెంట నిలిచాయి. ఈ నాలుగు కులాలు ఈ ఎన్నికల్లో బీజేపీపై విశ్వాసం చూపాయి. మహిళా శక్తిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మహిళ రక్షణ కవచంగా మారితే విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని అభినందిస్తాను. నారీ శక్తి వందన్ చట్టం వారికి నమ్మకం కలిగించింది. మరుగుదొడ్లు, విద్యుత్, నీరు, బ్యాంకు ఖాతాల్లో వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీజేపీ కృషి చేస్తోంది.

మీకు ఇచ్చిన హామీలను వందశాతం నెరవేరుస్తాం. ఇది మోదీ హామీ. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో యువతను ఉద్యోగాల కుంభకోణం ద్వారా అక్కడి ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ విధానాల వల్ల గిరిజన సమాజం వెనుకబడిపోయింది. వీరి జనాభా దేశంలో దాదాపు 10 కోట్లు ఉంది. గుజరాత్‌లో గిరిజన సమాజం కాంగ్రెస్‌ను తుడిచి పెట్టేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో గిరిజన సమాజం కాంగ్రెస్‌ను తుడిచి పెట్టేసింది. నేటి ఈ హ్యాట్రిక్ విజయం.. 2024 హ్యాట్రిక్‌కు మార్గం సుగమం చేసింది.

ప్రజాస్వామ్యంలో ప్రజలే తల్లి, తండ్రి. వారి ఆదేశాన్ని గౌరవించాలి, వినయంతో అంగీకరించాలి. ఫలితాల వల్ల నేను బాధపడ్డాను, కానీ ఆశ్చర్యపోలేదు. కాంగ్రెస్ పార్టీ నిస్సందేహంగా రాజస్థాన్‌లో పాత ఆచారాలు, ఆనవాయితీని మార్చగలదు. కానీ అశోక్ గెహ్లాట్ ఎప్పుడూ మార్పు కోరుకోలేదు. ఇది కాంగ్రెస్ ఓటమి కాదు అశోక్ గెహ్లాట్ ఓటమి. ఈ ఎన్నికల ఫలితాలు అవినీతిపై పోరాటానికి స్పష్టమైన సందేశం. అవినీతిని సహించేది లేదని నేటి ఆదేశం రుజువు చేసింది.

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

ఈ ఎన్నికల ఫలితం కాంగ్రెస్‌, దురహంకార కూటమికి గుణపాఠం. దేశ వ్యతిరేక శక్తులకు బలం చేకూర్చే రాజకీయాలు చేయొద్దు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భారత్‌పై ప్రభావం చూపుతుందని కొందరు అంటున్నారు. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. నా దేశ ప్రజల కలలను నెరవేర్చడం నా సంకల్పం, అదే నా ఆధ్యాత్మిక సాధన” అని ప్రధాని మోదీ అన్నారు.