Ramdev Baba: టెర్రరిస్టులు అయ్యాక కూడా నమాజ్ చేస్తారు.. ముస్లింలపై బాబారాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచం క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారు. ఇంతకుమించి వీరికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ముస్లింలు టెర్రరిస్టులుగా, నేరస్థులుగా మారుతున్నప్పటికీ నమాజ్ మాత్రం చేస్తుంటారు.

Ramdev makes bigoted speech against Muslims, Christians in Raj
Ramdev Baba: యోగా గురువు బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేశారు. హిందూ మహిళల్ని అపహరిస్తున్నారంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలు విద్వేష వ్యాప్తి చేస్తున్నారని చెప్తూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూ మతం చెబుతుందని, అయితే రెండు మతాలు (ఇస్లాం, క్రైస్తవం) మతమార్పిడికి పాల్పడుతుంటాయంటూ రాందేవ్ ఆరోపించారు. ఆయన ప్రసంగానికి చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేశారు. నమాజ్ తర్వాత వాళ్లేం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు కిడ్నాప్ చేస్తారు. వాళ్లు అన్నిరకాల పాపాలకు పాల్పడతారు. మన ముస్లిం సోదరులు అనేక పాపాలు చేసినా నమాజ్ మాత్రం తప్పనిసరిగా చేస్తారు. అలా చేయమని వాళ్లకు వాళ్ల మత గురువులు, కుటుంబీకులు నేర్పుతారు. కానీ హిందూ మతం అలాంటిది కాదు. కేవలం మంచి చేయమని మాత్రమే చెప్తుంది” అని అన్నారు.
“Namaz padho aur Phir duniya bhar mein aatank failao, Church mein candle jalao aur aapke sare paap maaf ho jayenge”.
Baba Ramdev… pic.twitter.com/lFR3lbE67l— Ashish (@aashishNRP) February 2, 2023
అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచం క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారు. ఇంతకుమించి వీరికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ముస్లింలు టెర్రరిస్టులుగా, నేరస్థులుగా మారుతున్నప్పటికీ నమాజ్ మాత్రం చేస్తుంటారు. తెల్లవారుజామునే లేవాలి, భగవంతుడిని ప్రార్థించాలి, యోగా చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి, ఇష్టదైవాన్ని పూజించాలని హిందూయిజం చెబుతుంది. సనాతన ధర్మం మనకు బోధించేది ఇదే” అని రామ్‌దేవ్ అన్నారు.
Preneet Kaur: మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్యను సస్పెండ్ చేసిన కాంగ్రెస్