చీటింగ్ కేసులో రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ అరెస్ట్

740కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ఫార్మా దిగ్గజం రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ ను గురువారం(అక్టోబర్-10,2019)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శివిందర్‌తో పాటు ఆయన సోదరుడు మల్విందర్ సింగ్ సైతం ఈ కేసులో ఉన్నాడు. వీరిద్దరి ఇళ్లు,కార్యాలయాల్లో ఈ ఏడాది ఆగస్టులో ఈడీ సోదాలు చేసిన విషయం తెలసిందే. 740కోట్ల రూపాయలను దారిమళ్లించారంటూ రిలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ కంప్లెయింట్ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది డిసెంబర్ లో సింగ్ సోదరులపై ఢిల్లీ పోలీసుల ఆర్థికనేరాల వింగ్ కు రిలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ కంప్లెయింట్ చేసింది. మే నెలలో సింగ్ సోదరులపై కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు సోదరులను విచారణ చేస్తున్నారు.
సింగ్ సోదరులు వారి తండ్రి స్థాపించిన రాన్బాక్సీ లాబొరేటరీస్ లిమిటెడ్ అనే మల్టీ బిలియన్ డాలర్ల ఔషధ సంస్థకు వారసులు. వారు దీనిని 2008 లో జపనీస్ సంస్థ డైచి సాన్క్యోకు విక్రయించారు. వారి కుటుంబానికి చెందిన ఫోర్టిస్ హెల్త్‌కేర్, హాస్పిటల్ ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ,రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌పై దృష్టి సారించారు. కానీ ఆర్థిక ఇబ్బందులతో రెండు సంస్థలలో వారి యాజమాన్యాన్ని కోల్పోయారు.
రాన్‌బాక్సీ వాటాలను విక్రయించేటప్పుడు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ శాఖ దర్యాప్తును ఎదుర్కొంటున్నట్లు సోదరులు దాచిపెట్టారని ఆరోపిస్తూ డైచి…సింగపూర్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడంతో సింగ్ సోదరులు డైచికి రూ. 3,500 కోట్లు చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ…డైచి సాంక్యోకు బకాయిలు చెల్లించాలన్న ఆదేశాలను ధిక్కరించినందుకు జైలుకు వెళ్లవచ్చని ఈ ఏడాది ఆరంభంలో సింగ్ సోదరులు సుప్రీంకోర్టుకి తెలిపారు.
సింగపూర్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో సింగ్ సోదరులు 2018 ఫిబ్రవరిలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. తమ ఉమ్మడి వ్యాపారాలు – ఆర్‌హెచ్‌సి హోల్డింగ్, రిలిగేర్ మరియు ఫోర్టిస్ లో తన సోదరుడు అణచివేత, దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో శివిందర్ సింగ్ తన తమ్ముడిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.