RBI on 2K Currency Note: రూ.2000 నోట్లు ఇంకా మార్చుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్

కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ప్రకారం, ఇతర డినామినేషన్ల బ్యాంక్ నోట్లు తగినంత పరిమాణంలో అందుబాటులోకి వచ్చినప్పుడు నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ 'క్లీన్ నోట్ పాలసీ' కింద నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

RBI on 2K Currency Note: రూ.2000 నోట్లు ఇంకా మార్చుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్

Updated On : September 30, 2023 / 5:52 PM IST

RBI on 2K Currency Note: పెద్ద నోట్ల ఉపసంహరణలో భాగంగా రూ.2000 కరన్సీ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడువు ఇచ్చింది. అంటే ఈరోజే చివరి రోజన్న మాట. అయితే ఇప్పటికీ మార్చుకోనివారి కోం ఆర్బీఐ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గడువును వచ్చే నెల 7వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ఆర్బీఐ శనివారం పేర్కొంది. వాస్తవానికి ఈరోజు ముగియడంతోనే ఆ నోట్లు చెల్లనివి అయిపోతాయి. కానీ ఆర్బీఐ తాజాగా ఇచ్చిన ప్రకటన మేరకు ఆ గడువు మరో వారం రోజులకు పెరిగింది.

రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం
శనివారం జరిగిన సమీక్ష అనంతరం ఒక వారం అదనంగా సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్ 30న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఉపసంహరణ ప్రక్రియకు నిర్ణీత సమయం ముగియనుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకునే విధానాన్ని అక్టోబర్ 7, 2023 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, నోట్ల మార్పిడిలో ఆర్బీఐ కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు అంటే సెప్టెంబరు 30 వరకు రూ.2000 నోట్లను ఏ బ్యాంకు శాఖలోనైనా మార్చుకోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లి తమ ఖాతాలో డబ్బులు జమ చేసుకునే వీలుండేది. ఇప్పుడు ఈ విధానం ఉండదు. ఇప్పుడు రూ.2000 నోట్లను ఆర్‌బీఐకి చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ యొక్క ఈ 19 కార్యాలయాలలో ప్రజలు తమ ఖాతాలలో 2000 రూపాయల నోట్లను కూడా డిపాజిట్ చేయవచ్చు.

ఈరోజు గడువు ముగిసిన తర్వాత మీరు ₹2,000 నోటును ఉపయోగించవచ్చా?
సెప్టెంబర్ 30 గడువు ముగిసిన తర్వాత కూడా రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయి కానీ లావాదేవీల్లో మాత్రం స్వీకరించబడవు. సెప్టెంబర్ 30 గడువు ముగిసిన తర్వాత, నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.

రూ.2000 నోట్లను ఎలా మార్చుకోవాలి?
*సెప్టెంబరు 30 వరకు రూ.2,000 నోట్లను ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలు లేదా సమీపంలోని ఏదైనా బ్యాంకు శాఖలో మార్చుకోవచ్చు.
*మీ సమీప బ్యాంకు లేదా RBI కి చెందిన ఏదైనా ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించండి.
*రద్దైన నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ‘అభ్యర్థన స్లిప్’ని (రెక్వెస్ట్ స్లిప్)ని నింపండి.
*ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఉపాధి హామీ కార్డ్ వంటి డాక్యుమెంట్‌పై ముద్రించిన మీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో సహా మీ వివరాలను నింపండి.
*మీరు ఎన్ని నోట్లను డిపాజిట్ చేస్తారో వివరాలను వెల్లడించండి.
*గరిష్ఠంగా రూ.20,000 విలువైన రూ.2,000 నోట్లను ఒకేసారి మార్చుకోవచ్చు. అంటే పది రూ.2,000 నోట్లకు అనుమతి ఉంటుంది.

గత నెల వరకు ఎన్ని నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి?
మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 93 శాతం కరెన్సీ నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు సెప్టెంబర్ 1న ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 31, 2023 వరకు చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు.

రూ.2000 నోటును రద్దు చేయాలని ఆర్బీఐ ఎందుకు నిర్ణయించింది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ.2000 డినామినేషన్ నోట్లు నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడ్డాయి. అప్పుడు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాన్ని వేగంగా తీర్చడానికి ఇది జరిగింది. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ప్రకారం, ఇతర డినామినేషన్ల బ్యాంక్ నోట్లు తగినంత పరిమాణంలో అందుబాటులోకి వచ్చినప్పుడు నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.