అందుకు కేంద్రమే కారణం..దేశంలో శాంతికోసం “ఏ పాత్ర”నైనా పోషిస్తా: రజినీకాంత్

నిన్న మొన్నటివరకు కాస్త బీజేపీకి అనుకూలం అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్.. కేంద్రంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఢిల్లీ అల్లర్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో అల్లర్ల విషయంలో కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టారు. వాళ్ల వైఖరిపై విమర్శలు గుప్పించిన రజినీకాంత్.. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలిగితే.. గతంలో చెప్పినట్లుగానే తాను వాళ్ల వెంట నడుస్తానని స్పష్టం చేశాడు.
See Also | కొరటాలతో సినిమా టైటిల్ చెప్పేసిన చిరంజీవి.. ఆ తర్వాత సారీ కూడా చెప్పారు
లేటెస్ట్‌గా దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంటానని మరోసారి రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన ఘర్షణలను ఖండించిన ఆయన.. పలువురు ముస్లిం మత పెద్దలతో భేటి అయిన తర్వాత ‘‘దేశంలో శాంతిని పెంపొందించేదుకు నా వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.
ఘర్షణల్ని అదుపు చేయడంలో కేంద్రం తీరు సరిగ్గా లేదని అన్న ఆయన.. హింస ఆపలేనివారికి పదవులు అవసరమా అంటూ విమర్శలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు ముమ్మాటికి కేంద్రప్రభుత్వం నిఘా వైఫల్యమే అని విమర్శించారు.(రెండో టెస్ట్‌లో భారత్‌పై కివీస్ విజయం)